సుప్రభాత సేవ టికెట్స్ విడుదల | TTD SEVA TICKETS FOR OCTOBER 2019

Tirumala Seva Tickets

Tirumala Seva Tickets Details :

తిరుమల శ్రీవారి సుప్రభాతం చుద్దాం అనేది ఎందరో భక్తుల కల. సుప్రభాతం , నిజపాద దర్శనం , తోమాల సేవ , అర్చన , అష్టదళ పాదపద్మారాధన సేవలను ఆర్జిత సేవలు అని పిలుస్తారు. ఈ సేవలకు వెళ్లేవారు స్వామి వారిని మొదటి గడపనుంచి స్వామి వారిని దర్శించే భాగ్యం లభిస్తుంది. సుప్రభాతం అన్ని రోజులు ఉంటుంది. మిగిలిన సేవలు వారం లో కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతినెల మొదటి శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. అక్టోబర్ నెలకు ఆర్జిత సేవ టికెట్స్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

టికెట్స్ బుక్ చేసుకున్నవారికి లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ 5 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 9 వ తేదీ ఉదయం 10 గంటల వరకు టీటీడీ సేవ ఆన్లైన్ డాట్ కామ్ లో బుక్ చేస్కోవచ్చు. 9 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినవారికి మెయిల్స్ మరియు SMS లు పంపిస్తారు. సెలెక్ట్ అయినారు 9 తేదీ 12 గంటల నుంచి 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

కల్యాణోత్సం టికెట్స్  5వ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఎవరు ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటారో వారికే టికెట్స్ లభిస్తాయి. ప్రస్తుతం ఆగష్టు వరకు రూమ్స్ బుక్ అయ్యాయి. ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి వీలు లేదు కానీ అప్పడికప్పుడు CRO దగ్గర రూమ్స్ ఖాళీలను బట్టి భక్తులకు రూమ్స్ ఇస్తారు.

సుప్రభాతం టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటే మనకు వచ్చే అవకాశం ఉందొ క్రింది వీడియో లో చూపించిండం జరిగింది ఈ వీడియో చూడండి

Tirumala Seva tickets Tirumala room booking tirumala tour

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *