తిరుమలలో ఏమేమి చూడాలి ? తిరుపతి లో ఏమి చూడాలి ? | Tirumala Tour Guide

Tirumala Tour Detailsతిరుమలలో ఏమేమి చూడాలి ? తిరుపతి లో ఏమి చూడాలి ?

తిరుపతి చుట్టుప్రక్కల గల ప్రసిద్హ క్షేత్రాలు ఏమి ఉన్నాయి ఎంత దూరం లో ఉన్నాయి తెల్సుకుందాం . తిరుమల వచ్చిన వారు చూడవలసిన ప్రదేశాలను చూడకుండానే వెళ్లిపోతుంటారు కారణం ఈ క్షేత్రాల కోసం తెలియక . చివర్లో దర్శనానికి ఎలా వెళ్లాలో కూడా  వివరిస్తాను . తిరుమల మొదటి సారి వెళ్లేవారికి  బాగా ఉపయోగపడగలదు .

తిరుమల చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుమల కొండ క్రింద అనగా తిరుపతి లో గోవింద రాజుల గుడి, అలిమేలు మంగాపురం ఈ ఆలయాన్నే తిరుచానూరు పద్మావతి ఆలయం అని పిలుస్తారు. , శ్రీ కళ్యాణా వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా శ్రీనివాస మంగాపురం, కపిలతీర్ధం. ఉన్నాయి .

వీటిలో అలిమేలు మంగాపురం చేరుకోవడానికి తిరుపతి బస్సు స్టాండ్ నుంచి బస్సు లు ఉంటాయి  5 కిమీ దూరం లో ఈ ఆలయం కలదు . తిరుపతి నుంచి అలివేలు మంగాపురం గోవిందా రాజుల గుడికి లోకల్ సిటీ బస్సు లు తిరుగుతుంటాయి .  కపిలతీర్థం మరియు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి గుడి ఈ రెండు శ్రీవారి మెట్టుకు వెళ్లే దారిలో ఉంటాయి . మీకు సరిగా చెప్పాలంటే అలివేలు మంగాపురం తిరుపతి రైల్వే స్టేషన్ కు రైట్ సైడ్ ఉంటె లెఫ్ట్ సైడ్ లో కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .

రైల్వే స్టేషన్ కు కపిల తీర్ధం 3 కిమీ దూరం లోను , కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం 12 కిమీ దూరం లోను ఉంటుంది . రైల్వే స్టేషన్ నుంచి బస్సు లు ఉంటాయి . కపిలతీర్థం వర్షాకాలం లో చూస్తే చాల బాగుంటుంది . వెంకటేశ్వర స్వామి కొండపైకి వెళ్లేముందు 6 నెలల పాటు కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం లోనే ఉన్నారనీ స్థలపురాణం .

తిరుమలకు ఒక గంట నుంచి 3 గంటల్లో చేరుకునే ఆలయాలు శ్రీ కాళహస్తి, కాణిపాకం, అర్ధగిరి , గోల్డెన్ టెంపుల్ ( బంగారం గుడి ), గుడిమల్లం, తలకోన, తిరుత్తణ్ణి, కాంచీపురం,అరుణాచలం ఈ ఆలయాలకు కొండపై నుంచి మరియు కొండ క్రింద నుంచి బస్సు సౌకర్యం ఉంది. తిరుమల లో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కాంచీపురం చూపించి తిరిగి తిరుమల తీస్కుని రావడానికి van, mini buses లు ఉన్నాయి.

కాణిపాకం లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంది . ఈ ఆలయం లో గణపతి స్వయం భూ ; స్వామి వారు నిత్యం పెరుగుతుంటారు . తిరుపతి నుంచి 63 కిమీ దూరం లో ఈ ఆలయం ఉంది . ఇక్కడ నుంచి శ్రీ పురం గోల్డెన్ టెంపుల్ వెళ్లడం ఉత్తమం . కాణిపాకం నుంచి 60 కిమీ దూరం లో శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఉంటుంది . రాత్రి 8 గంటల వరకే ప్రవేశం ఉంటుంది . రాత్రి సమయం లో గోల్డెన్ టెంపుల్ చాల చాల బాగుటుంది . లైటింగ్ మధ్య బంగారం గుడి బలే మెరుస్తుంటుంది . లక్ష్మి దేవి నిలయంగా మనకు అనిపిస్తుంది .

శ్రీపురం నుంచి కంచి 88 కిమీ దూరం ఉంటుంది . శ్రీ పురం నుంచి తిరువణ్ణామలై అరుణాచలం అని కూడా పిలుస్తారు . 82 కిమీ దూరం ఉంటుంది . శ్రీపురం నుంచి కాంచీపురం , తిరువణ్ణామలై వెళ్ళడానికి బస్సు లు ఉంటాయి .

తిరువణ్ణామలై క్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో అగ్ని లింగ క్షేత్రం . ఈ ఆలయం చాల పెద్దది . ఇక్కడ గిరిప్రదిక్షణ చేస్తారు . ( కొండ చుట్టూ ప్రదిక్షణ ) 14 కిమీ దూరం ఉంటుంది . ప్రతి రోజు ప్రదిక్షణ చేస్తారు పౌర్ణమి రోజు వేలల్లో జనం ప్రదిక్షణ చేస్తారు . తిరువణ్ణామలై నుంచి కాంచీపురం 120 కిమీ దూరం ఉంటుంది . పంచభూత లింగ క్షేత్రాలలో పృద్వి లింగ క్షేత్రం ఇక్కడే కలదు . అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కామాక్ష్మి అమ్మవారి క్షేత్రం కాంచీపురం లోనే కలదు . కాంచీపురం నుంచి తిరుమల కు బస్సు లు ఉంటాయి . 4 గంటల ప్రయాణం బస్సు లో .

పంచభూత లింగ క్షేత్రాలలో శ్రీకాళహస్తి లో వాయులింగ క్షేత్రం కలదు . ఈ క్షేత్రం రాహు కేతు పూజలకు ప్రసిద్ధి . ఇక్కడ నుంచి అతి పురాతన క్షేత్రమైన గుడిమల్లం 36 కిమీ దూరం లో ఉంటుంది . ఇక్కడ శివ లింగం ప్రత్యేకంగా ఉంటుంది అన్ని శివాలయాల్లో ఉన్నట్టు ఉండదు .

ఇప్పుడు మనం తిరుమలలో అనగా కొనపైనా ఏమి చూడాలో చూద్దాం . కొండపైన చూసేవాటిని రెండుగా విభజించవచ్చు . వ్యాన్ జీప్ లలో చూసేవి బస్సు లో వెళ్లి చూసేవి .

బస్సు లో ఐతే పాపవినాశనం , ఆకాశగంగా , జాబలి తీర్ధం గా పిలవబడే ఆంజనేయస్వామి ఆలయం . వేణుగోపాల స్వామి ఆలయం చూడవచ్చు . . వ్యాన్ లో ఐతే వీటితో పాటుగా శిలాతోరణం , శ్రీవారి పాదాలు చూడవచ్చు .

స్వామి వారి దర్శనానికి ప్రత్యేక దర్శనం అనగా 300 టికెట్లు ద్వారా వెళ్ళవచ్చు ఐతే ఈ టికెట్స్ అప్పటికప్పుడు దొరకవు . ఇతర సేవ లు అనగా సుప్రభాతం , తోమాల , కల్యాణోత్సవం , నిజపాద దర్శనం మొదలైన సేవలు కూడా 3 నెలల ముందే టికెట్ బుక్స్ చేసుకోవాల్సి ఉంటుంది . నడకదారులు రెండు కలవు ఒకటి శ్రీవారి మెట్టు , రెండు అలిపిరి మెట్ల మార్గం . శ్రీవారి దారిలో మెట్లు తక్కువగా ఉంటాయి . అలిపిరి లో మెట్లు ఎక్కువగా ఉంటాయి . అలిపిరి ద్వారా సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడితే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఐతే 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది . ఏ దారి లో వెళ్లిన ప్రత్యేక దర్శనం టికెట్స్ ఇస్తారు .

ఇప్పుడు తిరుమల కొత్త విధానం ప్రవేశ పెట్టారు దర్శనానికి ముందుగా టోకెన్స్ ఇస్తారు . ఈ టోకెన్ ద్వారా మనకు టైం స్లాట్ ఇస్తారు .. గంటల తరబడి లైన్ లో నిలబడకుండా ఎప్పుడు లైన్ లో కి రావాలో మన టోకెన్ పై ఉంటుంది .. టోకెన్ తీసుకోవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి .
ఆధార్ లేని వారు టోకెన్ లేకుండా సర్వదర్శనం లైన్ లో నిలబడాలి .

మీరు రూమ్స్ ముందుగా బుక్ చేసుకోకపోతే C.R.O దగ్గర అప్పటికప్పుడు ఖాళీ ఐన రూమ్స్ ఇస్తుంటారు . మీరు అక్కడ రూమ్స్ కోసం ప్రయత్నించండి . మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి . ఇంకా అదనపు సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి . ధన్యవాదములు .

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *