తిథి అంటే ఏమిటి ? తిథులు పక్షముల పేర్లు ఏమిటి ?
తిథి అనగా రోజు అని అర్థం. ఈ రోజుల్లో మనం తేదీ అని ఎలా చెబుతున్నామో వేదకాలం నుంచి తిథుల ప్రకారం చెప్పేవారు. తిథి కి సమయం సుమారు 19 గంటల నుంచి 26 గంటలు సమయం పడుతుంది అందుకనే ఒక్కో రోజులోనే రెండు తిథులు రావడం మనం గమనించవచ్చు. ఈ పద్దతిని చాంద్రాయణ పద్దతి అంటారు. అమావాస్యనుంచి పౌర్ణమికి చంద్రుని లో కలిగే మార్పుల ప్రకారం ఈ తిధులను లెక్కిస్తారు.
పక్షం :
శుక్ల అంటే తెలుపు అని అర్థం, కృష్ణ అంటే నలుపు అని అర్థం, శుక్ల పక్షం’ (అమావాస్య నుంచి పున్నమి వరకు) కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు)
తిథులు :
పాడ్యమి , విదియ , తృతీయ , చతుర్థి , పంచమి , షష్ఠి , సప్తమి , అష్టమి , నవమి , దశమి , ఏకాదశి , ద్వాదశి , త్రయోదశి , చతుర్దశి , పౌర్ణమి / అమావాస్య
ఇవి కూడా చూడండి :
రాశుల పేర్లు నక్షత్రాల పేర్లు అష్టాదశ పురాణాలూ ఉపనిషత్తులు ఆధ్యాత్మిక పుస్తక నిధి సనాతన ధర్మ మూలాలు