Sri Mallikarjuna Swamy Devasthanam History | Srisailam Temple

ఆలయ చరిత్ర

పురాతన కాలంనాటి మన హిందూ మత, సాంస్కృతిక మరియు సాంఘిక చరిత్రలో శ్రీశైల క్షేత్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పూర్వ చారిత్రాత్మక అధ్యయనాల ప్రకారం శ్రీశైలం సుమారు 30,000-40,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది.అన్ని సంవత్సరాల క్రితం నాటి రాతి ఉపకరణాలు శ్రీశైలం యొక్క వివిధ ప్రదేశాలలో విస్తారంగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్య స్థాపకులు మరియు ఆంధ్రదేశం యొక్క పూర్వపు పాలకులు అయిన శాతవాహనులతో శ్రీశైలం యొక్క చరిత్ర మొదలయ్యిందని శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి.

కొండ ప్రాంతమైన శ్రీశైలం యొక్క మొట్టమొదటి చారిత్రక ప్రస్తావనను 2 వ శతాబ్దంలో మల్ల శతకరనికి చెందిన పులుమవిల నాసిక్ శిలాశాసనంలో గుర్తించవచ్చు, ఈ ప్రాంతమును శాతవాహనులకు చెందిన మల్ల శతకరని పరిపాలించేవాడు అందుకే అతడిని పవిత్ర దేవుడైన మల్లన్నగా పిలిచేవారు. శ్రీశైలం నుండి 50 కిలోమీటర్ల దూరంలో, విజయపురిని వారి రాజధాని చేసుకొని ఇక్ష్వాకులు (క్రీ.శ.200-300) పాలించారు, అందుచే ఈ క్షేత్రమును వారి సామ్రాజ్యానికి సంరక్షత్వముగా భావించేవారు.
శ్రీ పర్వత స్వామి అని కొనియాడబడే శ్రీ శ్రీశైల మల్లిఖార్జున స్వామికి విష్ణుకుండియులు (క్రీ.శ. 375-612) అపర భక్తులు, శ్రీశైల క్షేత్రం మరియు మల్లిఖార్జున స్వామి వారి గురించి విష్ణుకుండియులకు సంబంధించిన శాసనాల్లో ఈ క్రింది విధంగా”భగవత్ శ్రీపర్వత స్వామి పదానుధ్యతనం” పేర్కొనబడి ఉన్నాయి.కదంబ శాంతివర్మ యొక్క తెలగుండా శాసనం ద్వారా శ్రీశైలం ప్రాంతం వాస్తవానికి పల్లవ రాజ్యంలో (క్రీ.శ. 248-575) చేర్చబడి, తరువాత కధాంబీయుల (క్రీ. 340-450) యొక్క మొదటి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది.

Accommodation – Srisailam Devasthanam

రెడ్డి రాజుల కాలం (క్రీ.శ. 1325-1448) శ్రీశైలం యొక్క స్వర్ణ యుగం, ఈ రాజవంశం యొక్క దాదాపు అందరు పాలకులు ఆలయం కోసం సేవలను జరుపుకున్నారు. ప్రోలయ వేమా రెడ్డి శ్రీశైలం మరియు పాతాళగంగకు మెట్లమార్గం నిర్మించారు. అనవేమారెడ్డి వీరశిరో మండపంను నిర్మించారు.
ఉమమహేశ్వరం నుండి శ్రీశైలం వరకు జఠరరేవు మీదుగా వెలమ వంశస్థులు మెట్ల మార్గమును నిర్మించారు. శ్రీశైల ఆలయం యొక్క మరమ్మత్తులు మరియు పునర్నిర్మాణాలు వంటి వాటిల్లో విజయనగర రాజులు (క్రీ.శ. 1336-1678) ముఖ్య పాత్ర వహించారు. విజయనగర సామ్రాజ్యం యొక్క రెండవ హరిహరరాయ మల్లికార్జున ఆలయం యొక్క ముఖమండపం మరియు దేవాలయ సముదాయానికి దక్షిణాన ఒక గోపురాన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1516లో శ్రీ కృష్ణదేవరాయలు సందర్శించారు మరియు వీధికి రెండు వైపులా సాలమండపములను నిర్మించారు.

తరువాత మొఘల్ చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు ఈ ప్రదేశం కర్నూలు నవాబులకు జగీర్ గా ఇవ్వబడింది. మొఘల్ చక్రవర్తుల పతనం తరువాత ఈ ప్రాంతం హైదరాబాద్ నిజాం యొక్క నియంత్రణలో వచ్చింది. నిజాం 1870లో కర్నూలు జిల్లాను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించినప్పుడు మేజర్ మన్రో జిల్లా కోర్టు అధికారుల నిర్వహణకు అప్పగించారు. 1929లో ఆలయ నిర్వహణ కోసం ఒక కమిటీని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1949లో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది.1956లో రోడ్డు మార్గం ప్రారంభించిన తరువాత దాని పూర్వ వైభవము సాధించింది.

ఇతిహాసాలు:

పర్వతుడి యొక్క కథ:

శిలాద మహర్షి కుమారుడు పర్వతుడు, పర్వతుడు శివుడి కోసం తపస్సు చేయగా స్వామి ప్రత్యేక్షమై ఏమి కావాలో అడగగా పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా నువ్వు నన్ను పర్వతముగా మార్చి నాపై కొలువుండే వరం ప్రసాదించమని మరియు అన్ని భగవానుల పవిత్ర జలాలు శాశ్వతంగా నాపైనుండి ప్రవహించాలని కోరుకున్నాడు. పర్వతుడి ఆకారం పెద్ద కొండ ‘శ్రీశైలం’గా అవతరించింది మరియు శివుడు శ్రీ పర్వత స్వామిగా పర్వతం పైభాగంలో వెలిసాడు.

అరుణాసురుడి యొక్క కథ:

హిందూ మత పురాణాల ప్రకారం, అరుణాశురుడనే రాక్షసుడు సాధుజనులను పరమభాదలు పెడుతుంటే అది సహించలేని పార్వతి దేవి కోపోద్రిక్తురాలై భ్రమర రూపిణి అయి నాదం చేస్తూ అరుణాశురుడిని సంహరించింది. అమ్మవారు భ్రమర రూపం దాల్చి దుష్టసంహారం చేశారు కావున భక్తులు భ్రమరాంభికాదేవిగా కొలుస్తారు. ఇక్కడ జరిగిన దక్ష యజ్ఞములో సతీదేవి యొక్క మెడ భాగాన్ని ఉంచారు అందుచే ఈ స్థలం శక్తి పీఠం గా మారింది.

చంద్రవతి యొక్క కథ:

సాహిత్య ఆధారాల ప్రకారం, శ్రీశైలం దగ్గరలో ఉన్న చంద్రగుప్త పట్టణంను పరిపాలించే రాజు యొక్క కూతురు ఈ చంద్రవతి. చంద్రవతి ఆమె తండ్రికి దూరంగా శ్రీశైలం కొండల్లో కొంత మంది సేవకులతో ఉండేది.
ఒక రోజు ఆమె పశువులు ఒక శివలింగమును పోలి ఉన్న సహజ రాతి నిర్మాణం పైన నిలబడి అది దాని పాలతో అభిషేకం చేయడంతో ఆమె శివుడు యొక్క స్వీయ లింగముగా భావించి రోజు పూజలు నిర్వహిస్తుండేది.ప్రతి రోజు మల్లెపూల దండను(మల్లికా పుష్పం) స్వామి వారికి సమర్పిస్తూ ఉండేది.ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యేక్షమై వరము కోరుకోమ్మని అడగగా నేను మీ శిఖరముపై ఉంచిన మల్లెపూలదండ ఎన్నటికీ వాడిపోకుండా శాశ్వతముగా ఉండేలా వరం ప్రసాదించమని అడిగింది అపుడు శివుడు ఆ మల్లెపూల దండను శిరముపై గంగా, చంద్రవంకల మద్య దరిస్తాడు.ఇలా తలపై మల్లెపూల దండ ధరించాడు కావున స్వామిని మల్లిఖార్జునుడయ్యాడనీ(మల్లికా-అర్చిత-స్వామి) ప్రతీది.

వాసుమతి యొక్క కథ:

కథ ప్రకారం వాసుమతి ఈ పర్వతం పైన బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ఆమె తపస్సుకు బ్రహ్మ ఆనందించి, ఆమెకు కనిపించాడు.అప్పుడు ఆమె పేరును “శ్రీ”గా మరియు అదే పేరుతో వచ్చేలా ఈ కొండను శ్రీ-శైలంగా అని పేరు పెట్టాలని కోరింది.అలాగే శ్రీశైలముగా పిలవబడుతుంది.

వృద్ధ మల్లిఖార్జున స్వామి యొక్క కథ:

శివ భగవంతుడిని పూజించే ఒక రాజకుమారి అతడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది.ఒక రోజు ఆ రాజకుమారి కలలో శివుడు వచ్చి ఒక నల్ల తుమ్మెదను అనుసరిస్తూ రమ్మని చెప్పాడు అప్పుడు ఆమె నిద్ర నుండి మేల్కొని తేనెటీగను కనుక్కొని శ్రీశైల పర్వతమును చేరుకుంది కానీ తేనెటీగ చివరకు ఒక మల్లెల పొదలో స్ధిరపడుతుంది ఆ రాజకుమారి శివుని కోసం అక్కడే ఉండి పోతుంది.అక్కడ ఉన్న చెంచు జాతుల వారు ప్రతిరోజు తేనె మరియు అడవి పండ్లతో ఆమెను పెంచుతారు.
చాలా ఏళ్ల తర్వాత శివుడు ముసలి మరియు ముడతలు పడిన ముఖంతో ఆమె ముందుకు వస్తాడు.ఆ రాజకుమారి అతనిని వివాహం చేసుకుంటుంది. వివాహం సందర్భంగా చెంచు జాతి వారు విందుకు మాంసం మరియు పానీయాలతో ఆహ్వానించారు. శివుడు ఆ భోజనాన్ని అంగీకరించలేదు, అయితే రాజులు అతనిని పట్టుబట్టడానికి ప్రయత్నించారు. చివరగా శివుడు ఆ స్థలం వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె అతనిని ఒక రాయి (లింగం)గా మార్చింది మరియు అతను వృద్ధ మల్లికార్జున స్వామిగా అయ్యారు.

చెంచు మల్లయ్య యొక్క కథ:

స్థానిక గిరిజన చెంచు జాతి వారి కథనం ప్రకారం, ఒక సందర్భంలో శివుడు శ్రీశైలం అడవికి వేటగాడిగా వచ్చి,చెంచు జాతి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, ఆమెను వివాహం చేసుకుని, కొండపై స్థిరపడినాడు. మల్లికార్జున స్వామిని వారి సంబంధంతో చూస్తూ శివుడిని చెంచు మల్లయ్యగా పిలుస్తారు. ఈ కథ ఆలయం యొక్క ప్రహరీ గోడపై కూడా లిఖించబడి ఉంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *