Sri Kalahasthi | Real Facts About Srikalahasti Temple | Accommodation

ఆలయ చరిత్ర

క్రీ.శ. 2వ 3వ శతాబ్ధాలలో తమిళ దేశానికి చెందిన శైవ నయనార్లు అప్పర్, సుందర్, తిరుజ్ఞాన సంబందర్, మాణిక్య వాచకర్ మొదలైన వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి దీని ప్రాముఖ్యన్ని గురించి భక్తితో గానం చేసియున్నారు. శ్రీ ఆదిశంకరచార్యులు ఈ క్షేత్ర సందర్శణాంతరం తన శివానంద లహరి లో భక్త కన్నప్ప ను ఉదహరించడమే గాక ఈ క్షేత్రం లో భువనేశ్వరి దేవి పీఠాన్ని స్పటిక లింగాన్ని ప్రతిష్టించారు. గిరిజన ప్రాంతంలో ఈ క్షేత్రం నిర్మింపబడి ఉండటం వలన క్రీ. శ. 5,6 శతాబ్దాల దాకా దీని పోషణ గూర్చి ఎవరూ తమ దృష్టిని కేంద్రీకరింపలేక పోయారు. కానీ దక్షిణ భారత దేశంలో పల్లవుల రాకతో అధ్బూతమైన శిల్ప కళాఉధ్యమం రాజకీయంగా, ప్రాంతీయంగా అభివృధి చెందింది. ఆ నాడు దేవాలయ నిర్మాణము త్వరగా పాడవకుండాఉండేందుకు కలప, రెల్లు, మట్టితో నిర్మింపబడేవి. భక్తి ఉధ్యమం ప్రారంభమయ్యే దాకా శ్రీకాళహస్తి క్షేత్రం స్థానికంగా పలుకుబడి కలిగియున్న ఆటవిక సాయకుల చే ఆదరింపబడుతూ ఉండేది.

శిల్పం ద్వారా శాలి శాసనాల ద్వారా లభ్యమైన ఆధారాలను బట్టి క్రీ.శ. 9 వ శతాబ్దంలో పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రంలో దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. కుళోత్తుంగ చోళుడు ఈ దేవాలయ గోపురాన్ని నిర్మించినారు. ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తి మహత్యము వలన వీర నరశింహ యాదవ రాయలు హైమ, గిరిజ గుహ భైరవ గుహ అనే గుదనాలను, గోపుర మంట పాదులను నాట్య మందిరాన్ని ఇటుకలతో నిర్మించినట్లు తరువాత క్రీ.శ.12 వ శతాబ్ధానికి వీర నరసింహ రాయలు గోపురాలు, ప్రాకారాలు నిర్మించి వుండటానికి చెప్పవచ్చు. దక్షిణ గోపురాన్ని 12వ శతాబ్ధం లో కులోత్తుంగ చోళుడు కట్టించారు. బిక్షాల గోపురం ను దేవదాసి బిచ్చాలు కట్టించిందని ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహ రాయలు కాలములో జరిగినట్లు చెప్పుదురు. పదహారు కాళ్ళ మండపం లోనే క్రీ.శ.1529 లో క్రీ.శే.కృష్ణదేవరాయల సోదరుడైన అచ్చుతరాయల పట్టాభిషేక మహోత్సవము జరిగినది. కీ.శే.16వ శతాబ్ధంలో శ్రీ కృష్ణ దేవరాయలు ఒక మండపాన్ని నిర్మింప చేశాడు. దానినే ‘రాయల మంటపం ‘ అంటారు. మరియు పెద్ద గాలి గోపురం నిర్మించినారు. గోల్కొండ రాజ్య మంత్రులైన అక్కన్న, మాదన్నలు తమ పేర్లతో ఇక్కడ శివలింగాలు ప్రతిష్టించారు.

Sri Kalahasti Temple Accommodation

ఈ దేవాలయ నిర్మాణ విస్తరణ కేవలం ఉత్తర, దక్షిణ,పశ్చిమ దిశల వైపు మాత్రమే సాగినది. కానీ పర్వతము అడ్డుగా వుండడము వల్ల తూర్పు వైపునకు సాగలేదు. పడమటి దిశ వైపు చూపు గలిగిన గర్భగుడి ఎటువంటి అలంకారాలు లేకుండా పల్లవుల నాటి శైలి పోలివుంది. దీనివల్ల ఈ దేవాలయము పల్లవుల కాలమునాటిదని తెలుస్తుంది. ఈశ్వరునిగర్భగుడికి ఈశాన్య దిక్కున నాలుగు మీటర్ల దూరములో అమ్మవారి గర్భగుడి నిర్మింపబడి వున్నది. ఈ సన్నిదిలో నెలకొన్న దేవిని జ్ఞానప్రసూనాంబ అని పిలుస్తారు. ఈశ్వరుని సన్నిది శిల్ప కళ వెలుపలి భాగం కనిపించే అద్భుత చిత్రములైన కూట పంజర శాల వరుసలు, తామరపు మొగ్గల చిత్రములు, స్థంబాల, మీద గల అందమైన రంగు వల్లులు పాండ్య, విజయ నగర రాజుల నాటివని తెలుపుతున్నాయి. కీ.శ. 18వ శతాబ్ధంలో తమిళనాడుకు చెందిన నాటుకోటి శెట్టియార్ లోపలి ప్రాకారంలో గల శివాలయం, దేవి ఆలయాలకు, మంటపాలకు నాలుగు వైపుల వసారాలు కట్టించి వాటి కొక రూపాన్ని ఏర్పరచినారు.

ప్రాశస్త్యము
శివానందైక నిలయము (కైలాస పర్వతము)

శివానందైక నిలయము అనే పర్వతము ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రము నందు కలదు. ఈ శివానందైక నిలయము కైలాస పర్వతము గల పంచశిఖరములలో ప్రశిద్ధమనే శిఖరము. బ్రహ్మదేవుడు సృష్టికార్యము చేయు శక్తిని కోరి శివుని ప్రార్ధించగ బ్రహ్మదేవునికి శివుడు ఈ శిఖరం నీవు ఓర్వలేని బరువుతో భూమి మీద ఎక్కడ జారవిడిచెదవో అదియే దక్షిణ కైలాసము గా ప్రసిద్ధి పొందును. ఆ క్షేత్రమున నీవు తపమాచరించిన, స్వర్ణాభిష్టములు పొందగలవని పరమశివుడు బ్రహ్మదేవునకు వరమొసంగెను. ఆనాడు బ్రహ్మ దేవునకు పరమశివుడు అనుగ్రహించిన పర్వత శిఖరమే నేడు శ్రీకాళహస్తీలోని శివానందైక (కైలాస పర్వతము ) నిలయముగా కొలువుధీరియున్నది. ఇందుకు చిహ్నంగానే ఈ యొక్క క్షేత్రము నందు బ్రహ్మదేవుని ఆలయము కూడా కలదు. ప్రస్తుతము దక్షిణ కైలాసములోని శివానందైక నిలయ పర్వత శిఖరమునే కన్నప్ప కొండగా పిలువబడుచున్నారు. కావున ఈ క్షేత్రమును సిద్ధ క్షేత్రమని ప్రసిద్ధి పొందినది.

ప్రపంచ ముదయించిన మొదటి రోజుల్లో వాయు దేవుడి కర్పూర లింగాన్ని భక్తి శ్రద్దలతో పూజించి అనేక వేల సంవత్సరములు తపస్సు చేశాడని తెలియచున్నది. ఆయన తపస్సు కు సాక్షాత్కరించిన పరమేశ్వరుడు ‘వాయుదేవా ‘ నీవు చలనం గలవాడవయ్యును చలనం లేని భక్తితో నన్నింత కాలం ధ్యానించి చేసిన తపస్సుకు ఆనందించాను. భక్తుడవు కనుక నీకు కావలసిన వరాలు ఇవ్వడానికి వచ్చాను. నీకు కావలసిన వరాలు ఏమిటో కోరుకో యిస్తా అన్నాడు. అందుకు వాయు దేవుడు ‘స్వామి’ నేని ప్రపంచము నందు లేని తావంటూ లేకుండగను, పరమాత్మ చందంబున ప్రతి జీవి యందు నేను ప్రధానమై యుండు లాగునను, నీ ప్రతిరూపమైన ఈ కర్పూర లింగము నా పేరు పిలువబడునట్లు నాకు వరములను ప్రసాదింపు ‘అని దోసిలి పట్టాడు. సాంబ శివుడు సంతోషించి ‘ఓయీ ! నీవు అభిలషించిన ఈ మూడు వరములను కోరదగినవే. నీ అభిమతము ననుసరించి నీవీ ప్రపంచమంతటను వ్యాపించి వుండువు. నీవు లేక జీవరాశి బ్రతుక జాలదు. నా యీ లింగము ఇక మీద నీ పేరున వాయు లింగమని ప్రఖ్యాతి గాంచి సమస్త సుర అసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధి సాధ్వి నరముని వరుల చేతను పూజాలందుకొని నని’ వరములిచ్చి అదృశ్య మయ్యెను. నాటి నుండి ఈ క్షేత్ర మందలి కర్పూర లింగం వాయు లింగమను పేరున సమస్త లోకాల వారిచే పూజ లందుకోoటుంది.

శ్రీ జ్ఞానప్రసూనాంబ :

దక్షయజ్ణ సమయమున ద్రాక్షాయణి దేవి యాగాగ్ని యందు దగ్దమైన పిదప మరల హిమవంతుని పుత్రికగ గౌరీ దేవి గా జన్మించి, పరమశివుని కళ్యాణమాడ పూనెను. అందులకు గాను పరమేశ్వరుడు ఈ యొక్క శక్తిని నీవు తిరిగి పరిపూర్ణముగా పొందిన గాని వివాహమాడుటకు వీలుపడదని చేప్పెను. అందులకు పరమేశ్వరి తక్షణ కర్తవ్యము ఏమని పరమేశ్వరుని కోరగ అప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరికి (పంచాక్షరి) మంత్రోపదేశము ఉపదేశించెను. తదుపరి పరమేశ్వరి ఈ యొక్క క్షేత్రమునందు తన స్వహస్తము తో శ్రీచక్ర స్థాపన కావించుకొని అనుష్టించి తన శక్తిని తాను తిరిగి పొంది పరమేశ్వరుని కళ్యాణముచేసుకొని శ్రీచక్ర బిందు స్థాపనమున నిలచి తాను సాధించిన జ్ఞాన శక్తిని సమస్త జీవరాసులకు పంచి పెడుతూ వున్నది. కావున ఈ క్షేత్రము యందు జ్ఞానప్రసూనాంబికగ వ్యవహరించి పూజాలందుకొనబడుచున్నది. తనచే మంత్రోపదేశము పొందినటువంటి భరద్వాజ మహాముని (మహర్షి) మొదలు ఇప్పటి వరకు భరద్వాజ వంశీకులే ఈ క్షేత్రము యందు షడ్ కాల పూజలు నిర్వహించడం జరుగుచున్నది.

సువర్ణముఖి నది : – ( దివ్య గంగా)

అగస్త్య మహా ముని తన శిష్య గణంబుతో దక్షిణ దిగ్భాగమునకు వచ్చి తపము చేయుచుండెను. అప్పుడు వారికి నీరు లభింపకుండుటచే బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరిoచెను. బ్రహ్మ ప్రత్యక్షమై తపమునకు మెచ్చి వర ప్రసాదముగా ముని కోరిన విధముగా ఆకాశ గంగను నియోగించెను. గంగా దేవి సువర్ణముఖరీ స్రవంతి రూపమును అగస్త్య పర్వతములో అవతరించి శ్రీకాళహస్తి మీదుగా ఉత్తర వాహినియై తూర్పు సముద్రమున కలియుచున్నది. ఈనాడు నదిలో అనేక తీర్ధ రాజములు విలసితములై దక్షిణ కైలాసమునానుకొని ప్రవహించు చున్నది. సువర్ణముఖి ఈ క్షేత్రము న ఉత్తర వాహిని గా ప్రవహించుచున్నది. ఇది గంగా నదికి సమానమైనదిగా పురాణ ప్రసిద్ధినొంది యున్నది. గంగాధి నదులకు పన్నెండు సంవత్సరములకు ఒకమారు మాత్రమే పుష్కరములు వచ్చును.
కానీ ఈ దక్షిణకైలాస క్షేత్రములోని సువర్ణముఖి నదికి మాఘమాసమున మఖా నక్షత్రముతో కూడిన పౌర్ణమి రోజున విశేషముగా పుష్కరము జరుగుచున్నది.
కృత యుగంలో చెలిదీవుర్వు(సాలి పురుగు) తన శరీరము నుండి వచ్చు సన్నని దారముతో కొండపై నున్న శివుడునకు గుళ్ళు గోపురములు, ప్రాకారములు కట్టి శివుని పూజించు చుండెను. గాలి విచినప్పుడేల్లా తెగిపోయిన దారములను మరల అంటించుచు ఏమరపాటు లేక శివ సేవ చేయు చుండెను. ఒక నాడు శివుడు పరీక్ష చేయదలచి అక్కడ మండుచున్న దీపములో తగిలి సాలీడు కట్టిన గుడి, గోపురములు తగలబడ పోవుచున్నట్లు చెసేను. ఇది చూసి సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రత్యక్షమై దని భక్తికి మెచ్చి వరము కోరుకొనుమనెను. అప్పుడు సాలీడు మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనేను. అందుకు శివుడు సమ్మతించి సాలీడు తనలో ఐక్యమై పోవునట్లు చేసెను. ఈ విధముగా సాలీడు శివసాయిజ్యము పొంది తరించినది.

త్రేతా యుగములో ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను. త్రేతా యుగము ముగిసి ద్వాపర యుగము వచ్చినది. అప్పుడు ఏనుగు శివ లింగమును సేవింప జొచ్చును. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వ దళములు తెచ్చి పాము తెచ్చిన మణులను త్రోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకించి పుష్పములను అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను. మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గాక వానికి బదులు బిల్వములు, పుష్పములు పెట్టియుండుట గాంచెను. అది అప్పుడు త్రోసి వేసి,తాను తెచ్చిన మణులను పెట్టి పూజించి వెళ్ళేను.
తరువాత ఏనుగు వచ్చి యధా ప్రకారము తన పూజ గావించుకొని వెళ్ళేను. ఇట్లు కొంత కాలము తమ తమ ఇష్టాను సారముగా పూజ చేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి. తాను అర్పించిన మణులను ఎవరో ఉద్దేశ్య పూర్వకముగా తీసివేయుచున్నారని సందేహించిన పాము ఒక చాటున ఉండి గమనించ సాగెను, యధావిధిగా ఏనుగు వచ్చి మణులను తోసివేసి తన వెంట తెచ్చిన పుష్పములను ఉంచగా పాము ఆగ్రహించి ఏనుగు ను సంహరించే నెపముతో దాని తొండములోనికి దూరి బాధించసాగెను. బాధను తట్టుకోలేక ఏనుగు ఒక బండరాయికి తన తలను పదే పదే మోదగా ఏనుగు తొండములోని పాము మరియు ఏనుగు మరణించి శివసాయుజ్యము పొందెను. ఈ స్మృతి చిహ్నముగా కాళము పంచముఖి ఫణాకారముగా, శిరో పరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను, సాలెపురుగు అడుగు భాగములోను, తన లింగాకృతిలో ఐక్యమొసరించుకొని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ఇచ్చట దర్శనము ఇచ్చుచున్నాడు. ఆనాటి నుండి ఈ కేత్రమును శ్రీకాళహస్తి అని పేరు వచ్చినది.

భక్త కన్నప్ప :

అర్జునుడు పరమేశ్వర సాయిజ్యము పొందుటకు తిన్నడుగా కలి యుగమున జన్మించెను. పొత్తి పినాడు అని తెలుగు దేశంలోగల ప్రాంతమునందు ఉడుమూరు పల్లె కలదు. అందు నాధనాధుడు తండే అని బోయ దంపతులకు శివాను గ్రహముతో ఒక మగ శిశువు జన్మించెను. ఆ బాలునకు తిన్నడు అని పేరు పెట్టిరి. అతడు విలు విద్యలో దిట్ట అయ్యెను. ఒకనాడు అతడు వేటాడి అలిపి పోయి చెట్లు క్రింద నిద్రించు చుండుతరి శివుడు సాక్షాత్కారించి ఇట్లనేను. ఇక్కడి కొండ దగ్గర మొగలేటి యొడ్డున శివుడున్నాడు. పోయి అతనిని కొలువుము.
వెంటనే మేల్కోంచి చూడా ఒక అడవి పంది కనిపించెను. దానిని వెంటాడుతూ వెంట పడగ అది శివుడు ఉన్న చోటికే వానిని తెచ్చును. అప్పుడు తిన్నడు అచ్చటనే శివుని సాన్నిధ్యమున నిలిచిపోయి తన్మయుడై శివుని పరిపరి విధముల తన నివాస గృహమునకు రమ్మని ప్రార్ధించెను. కాని తన వేడుకోలు ఫలించక పోగా అతడు ఇచ్చటనే శివుని వద్ద నిలిచిపోయెను.

ప్రతి దినము అరణ్యమునకు వెళ్ళి పందిని వేటాడి చంపి, కాల్చి మాంస కండముల రుచి చూచి పక్వమైన వాటిని యేరి ఆకు దొప్పల యందుంచుకొని ఫల,పుష్ప బిల్వ దళములను శిరస్సు పై మోపి చంక యందు వింటివి, విపున నమ్ముల పొదియు, పుక్కిట సువర్ణముఖి నది తీర్ధమును కొని తన ఆరాధ దైవమునకు అందించెను. నోటితో తెచ్చిన గంగతో శివునికి అభిషేకించి, ఆకు దిప్పలతో తెచ్చిన మాంస శకలంబులను మహా నైవేద్యము గా నిడి శివుడు ప్రీతి చెందగా తిన్నడు ఆనందించెను.
ఆ సమయమున శివ గోచరడును సదాచార సంపన్నుడైన నొక బ్రాహ్మణుడు కూడ వచ్చి స్వామిని ప్రతి దినము అర్చించి పోవు చుండెను. చాలా కాలము నుండి పూజించుచున్న ఆ బ్రహ్మనునికి కొత్తగా చేయుచుండిన తిన్నని పూజలు ఎంగిలి మంగలముగా కనపడెను. దానికి అతను విచారించి,’ స్వామి మీ ఆలయం ఇటీవల కొన్ని దినములుగా నిరీతిగా మారుటకు కరణమేమని ‘ ప్రార్ధించి తెలపకున్న ప్రాణములు విడుతునని శపదంబు చేసెను. అప్పుడు స్వామి వాక్కుగా ఇట్లు వినబడెను. ఒక చెంచు నన్నిట్లు పూజ చేయుచున్నాడు. అతడు గొప్ప భక్తుడు, వాని భక్తికి ఎంత మహిమ కలదో నీవు కూడ చూతువు గాక యని అతనిని తన వెనుక దాగి యుండి అంతయు గాంచమనెను.

కొంత సేపటికి వాడుక మేరకు తిన్నడు యధా ప్రకారముగా వచ్చి స్వామికి అభిషేకమాచరించి తెచ్చిన మాంసపు ముక్కలు తినమనేను. కానీ స్వామి తినలేదు. ఇంతలో స్వామికి ఒక కన్ను వెంట నీరు కారునారంభించేను. క్రమముగా అది అధిక మయ్యెను. తీన్నడది గాంచి స్వామి కంటి జబ్బు వచ్చినదని చాలా భాధపడెను. గుడ్డను చుట్టగా చుట్టి నోటి ఆవిరి పట్టి కంటికి అద్దినాడు. తంగేడాకు మెత్తినాడు. నిమ్మరసముతో నూరి పోసినాడు. కలువ పువ్వు తెచ్చి కంటి రుద్దినాడు. అడవి అంతయు తిరిగి వెదకి వెదకి ఎన్నో మందులు తెచ్చి వేసినాడు. లాభము లేక పోయేను.
ఇంతలో కంటి నుండి రక్తం కూడా కారనారంభించేను. చివరకు కంటికి కన్నె మందు అనుకోని బాణముతో తన కంటి నొకదానిని పెకిలించి స్వామి కంటిపై నంటి పెట్టినాడు. దానితో స్వామి కన్ను నెమ్మిదించేను. కానీ విను వెంటనే రెండవ కన్ను నుండి కూడా రక్తము కారనారంభించేను. తిన్నడు నవ్వి ‘ఓ స్వామి ని దయ చేత కంటి మందున్నది’ అని కాలితో నెత్తురు కారుచున్న స్వామి వారి రెండవ కంటిని గుర్తుకై అదిమి పట్టి తన రెండవ కంటిని పెకలించ పోయేను. వెంటనే శివుడు తిన్నని భక్తికి పారవశ్యమునకు మెచ్చి సతీ సమేతుడై ప్రత్యక్షమై తిన్ననుకి, ఆ బ్రాహ్మణునికి శివ సాయుజ్యము నొసగెను. ఆనాటి నుండి శివునికి కన్నిచ్చి సార్థకముగా కన్నప్ప అను పేరు వడసి లోకులకు భక్తి మార్గ ప్రదీపకుడను శ్రీకాళహస్తి క్షేత్రములో భక్తి శిరోధార్యమై వెలుగొందుచున్నాడు.

Keywords:

Srikalahasti Temple ,Sri Kalahasti Temple,Timings, History, Hotels, Photos,Sri Kalahasti Temple Tirupati,Srikalahasti Temple History,srikalahasti temple history in telugu,శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి,srikalahasti temple online,Sri kalahasti temple seva tickets timings and tickets online booking,Kalahasti Temple Sevas,6 Best Srikalahasti Hotels,srikalahasti temple contact number,Online Rooms Booking,Rooms Bookings,Sri Kalahasti Temple Accommodation,srikalahasti Devastanam Accommodation

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *