సింహాచలం చుట్టూ ప్రక్కల ప్రసిద్ధ దేవాలయాలు

వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము.

శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, విశాఖపట్నం

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నం లోని బురుజుపేట పరిధిలోకల ప్రసిద్ద దేవాఅలయం.ఇక్కడి అమ్మవారు శ్రీకనకమహాలక్ష్మి విశాఖప్రజల గ్రామదేవతగా వెలుగొందుతున్నది.

ఉప్మాక అగ్రహారం

ఉపమాక లేదా ఉప్మాక అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలానికి చెందిన గ్రామము. ఈ ఊరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధిచెందినది.

దేవిపురం

దేవిపురం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఉన్న అరుదైన హిందూమత ఆలయ సముదాయం.ఈ ఆలయ సముదాయం ప్రధానంగా హిందూమతనికి సంబంధించిన శక్త పాఠశాలకు అనుబంధముగా ఉంది.

బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం

బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం కలిగిన ఆలయం. అందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. బ్రహ్మలింగేశ్వర ఆలయం విశాఖ జిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో శివాలయం. ఇది 16వ శతాబ్దంలో చోళులు నిర్మించినది. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరహానది ఉత్తరంగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా ఈ క్షేత్రం గుర్తింపు పొందింది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *