Shakti Peethas Information| Kangra Vaishno Devi Temple

Temple Information Timings

అష్టాదశ శక్తిపీఠాల్లో 15 వ శక్తిపీఠం శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం. శ్రీ వైష్ణవీదేవి ఆలయం జమ్మూనగరంకు 60 కి. మీ దూరంలో కాలధరము అనే పర్వత ప్రాంతంలో ఉంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి హిమాచల ప్రదేశ్ లోని జ్వాలాముఖి 82 కి.మీ లు. పఠాన్ కోట్ నుంచి రైలు సౌకర్యం ఉంది. జంబూ అన్న పదము కాలక్రమంలో జమ్ముగా మారినది. జమ్మూ నుంచి కత్రా కు 13 కి .మీ కాలినడకన ప్రయాణించి శ్రీ వైష్ణవి దేవి గుడికి వెళ్ళవచ్చు.

వైష్ణవీదేవి ఆలయ ప్రాముఖ్యత:

ఇక్కడ సతీదేవి పుర్రె (శిరస్సు ) పడిన ప్రదేశంగా చెపుతుంటారు. అమ్మ పుఱ్ఱె పడిన శక్తిపీఠము కనుక జ్ఞాన క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖీశ్వరి అని,జ్వాలాజీ,మాతా రాణి అని ఆరాధిస్తారు.ఇక్కడ వైష్ణవీ అమ్మవారు జ్వాల (మంట) రూపంలో ఉంటారు. గర్భగుడి మధ్యలో ఉన్న కుండలో రెండు వైపుల నుంచి మంట వస్తూ ఉంటుంది. జ్వాల రూపంలో ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారిని మహాకాళీ,మహాలక్ష్మి,మహాసరస్వతి రూపంలో భక్తులు పూజిస్తారు. జ్వాలాముఖీదేవి గర్భగుడికి చిన్న ప్రవేశ ద్వారం ఉంటుంది. ఈ ద్వారం నుండి తలను దూర్చి చూస్తే అమ్మవారి దర్శనం బాగా జరుగుతుంది. అమ్మవారి ప్రక్కనే 40 అడుగుల త్రిశూలం కలదు. భక్తులు గూటిలోపల తలపెట్టి రాధేశ్యామ్ అని ఎంత గట్టిగా అరిస్తే లోపలి జ్వాల అంత బాగా వెలుగుతుంది.ఈ ప్రాంతంలో కాలధరము అనే పర్వతం ఉంది. ఈ పర్వతం పై సతీదేవి నాలుక నిలువుగా పడింది. అందువల్ల అప్పటినుండి అగ్నిజ్వాల బయటకు వచ్చుచున్నది. ఈ అగ్నిజ్వాలానే జ్వాలాముఖీ అని పిలుస్తారు. అమ్మవారి దర్శనార్థం కోసం సంవత్సరం పొడవునా భక్తులు వస్తుంటారు.

ఇక్కడ చూడవలసిన ఆలయాలు :

అమ్మవారి గుడి ఎదురుగ మరో గుడి ఉంది. దానిలో నవదుర్గల విగ్రహాలు ఉన్నాయి. కొండసమీపంలో నవగ్రహాములు,ఇతర ఉప ఆలయాలు ఉన్నాయి. నాగినీమాత ఆలయం, అష్టభుజాటెంపుల్, అలాగే కాంగ్ర నాగర్కోట్ ఫోర్ట్, ధర్మశాల, పాలంపూర్, కంగ్రాలో లో జరిగే నవలా ఫెస్టివల్, కంగ్రాలో హరయాలి ఫెస్టివల్, కంగ్రాఫోర్ట్, అంబికాదేవీ ఆలయం, నాగినీమాత ఆలయం ఇంకా ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.

Sri Vaishno Devi Temple Timings:

Morning : 5 am to 12 pm
Evening : 4 pm to 8 pm

Vaishno Devi Temple address:

Jawalaji Temple Road,
Kohala,
Jawalamukhi,
Himachal Pradesh 176031,

Vaishno Devi Temple Phone Number .01970222 223.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *