Maharashtra Famous Temples Details | Maharashtra Tour Guide Best Places to Visit

Maharashtra Temple Details

మహారాష్ట్ర రాజధాని ముంబయి, వైశాల్యం పరంగా దేశం లో 3వ రాష్ట్రం మరియు జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం. మహారాష్ట్ర లో 35 జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు వరుసగా తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, కర్ణాటక, గోవా లు ఉన్నాయి. మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి.

నర్మద, తపతి నదులు మహారాష్ట్ర ఉత్తరభాగంలో నీటి వనరులు. ఇవి పడమటివైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు మనం మహారాష్ట్ర లో ప్రసిద్ధ క్షేత్రాలు వాటి వివరాలు తెల్సుకుందాం.

Shirdi Saibaba TempleShirdi Tour Information

షిర్డీ మహారాష్ట్ర ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి. సాయిబాబా భక్తులకు పవిత్ర స్థలము. షిర్డీ లో రైల్వేస్టేషన్ కలదు. రైల్వే స్టేషన్ నుంచి సాయిబాబా ఆలయానికి ఆటో లు ఉంటాయి. దర్శనానికి ముందుగా టోకెన్ తీస్కుని వెళ్ళాలి. ప్రతిరోజూ 4 హారతులు ఇస్తారు.

Shani Signapur TempleShani Signapur shaniswar temple

శనీశ్వర దేవాలయలలో శని శింగణాపూర్ లో ఉన్న శనీశ్వర దేవాలయం ప్రసిద్ధమైనది. షిర్డీ నుంచి 2 గంటలు పడుతుంది. ఇక్కడ షాప్ ల వారు 50/- విలువైన వాటిని కొత్తవారికి 500 కు అమ్ముతుంటారు. ఆలయం దగ్గర్లో ఉన్న షాప్ లో తక్కువకు వస్తాయి .

Triambakeshwar Jyotirlingamtrimbakeshwar temple nashik

త్రయంబకేశ్వర్ ఆలయం నాసిక్ దగ్గర్లో ఉంది. అంబక అంటే నేత్రము మూడు నేత్రముల దేవుడు కనుక త్రయంబకేశ్వర అని పేరువచ్చింది. ఇక్కడ శివలింగం పైకి ఉండదు. శివలింగం క్రింద భాగం మాత్రమే కనిపించి లోపల మూడు గుంటలుగా కనిపిస్తుంది. దర్శన సమయం లో జాగ్రత్తగా గమనించాలి.

Ellora Caves : Kailasanathar Ellora Caves Kailasanathar Temple

యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎల్లోరా గుహలు గుర్తింపబడ్డాయి. కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు.

Maharasthra Famous Places :

Mumbai

Nashik

Shirdi

Sani Singanapur

Aurangabad

Ajantha

Ellora

Nashik

Traimbakeshwar

Mukthidham

Panchavati

Grishneshwar

Pandaripuram

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *