Mahabharatam TTD 15 Books in Telugu Free Download | Telugu Devotional PDF Books

Mahabharatam Books Download

సంపూర్ణ మహాభారత పుస్తకాలు

ఆంధ్రమహాభారతానికి సమగ్రంగా వెలువడిన ఏకైక వ్యాఖ్యనం ఈ పుస్తకాలూ . తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎన్నో అమూల్యమైన గ్రంధాలను తెలుగువారందరికీ చేరువయ్యేలా తక్కువ ధరకే ఎన్నో పుస్తకాలను అందిస్తున్న సంగతి తెల్సిందే. సంస్కృతం లో వ్యాస మహర్షి రచించిన మహాభారతాన్ని కవిత్రమైన నన్నయ్య , తిక్కన , ఎఱ్ఱన తెలుగు లో కి అనువదించారు. ఆంధ్ర మహాభారతాన్ని విస్తృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక బృహత్ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారి ప్రధాన సంపాదకత్వ పరివేక్షణలో దేశంలోనే సుప్రసిద్ధులైన 30 మంది పండితుల చేత 18 పర్వాలను వ్యాఖ్యానింపచేసి 15 సంపుటాలుగా వెలువరించింది. 2005 సంవత్సరం లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు.


తక్కువ సమయం లోనే ఈ పుస్తకాలన్నీ అమ్ముడైపోయాయి . మొదటి ప్రింట్ లో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవిరించుటకు టీటీడీ ఏడుగురు సాహితీవేత్తలతో ఒక పండిత పరిషత్తు ఏర్పాటు చేసింది. ఆ పండిత పరిషత్తు సభ్యులందరు ఆమూలాగ్రంగా పరిశీలించిన తర్వాత పునర్ముద్రించ బడింది. ఇప్పుడు మీకు ఆ పుస్తకాలను హిందూ టెంపుల్స్ గైడ్ ఆర్గనేషన్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందిస్తున్నాము. పుస్తకాల పేర్లపై క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతాయి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *