40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే స్వామి వారి దర్శనం

Athi Varadar Utsavam 2019అత్తి వరదర్ ఉత్సవం 2019 కాంచీపురం

40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే స్వామి వారి దర్శనం .. 40 సంవత్సరాలకు ఒక్కసారిమాత్రమే మహావిష్ణువు  భక్తులకు దర్శనం ఇస్తారు .. అక్కడ భక్తులు పెద్ద ఉత్సవాన్నే చేస్తారు .. ఈ ఉత్సావాన్ని అత్తి వరదర్ ఉత్సవం గా పిలుస్తారు ..  1979 సంవత్సరం లో అత్తి వరదర్ ఉత్సవాలు జరిగాయి .. మరల ఇప్పుడు 2019 జులై ఒకటో తేదీ నుంచి ఆగస్టు 17 వరకు అత్తి వరదర్ ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇప్పుడు మీరు మిస్ అయితే మరల 2059 లోనే అవకాశం . ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది ? ఎలా చేరుకోవాలి ? అక్కడ చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు ఏమున్నాయి అనే వాటికోసం ఇప్పుడు తెల్సుకుందాం.

కాంచీపురం మనకు పరిచయం అక్కర్లేని పుణ్యక్షేత్రం. కాంచీపురం ఎన్నో క్షేత్రాలకు పుట్టినిల్లు ఆ లాంటి క్షేత్రంలో అడుగుపెడితే చాలు ఈ జీవితం ధన్యమైనట్టే. కాంచీపురం శక్తి పీఠం .. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. కంచి కామాక్షి , మధురై మీనాక్షి , కాశి విశాలాక్షి ఈ ముగ్గురమ్మల పేర్లు తెలియని వారుంటారు. కాంచీపురం పృధివి లింగ క్షేత్రం.. పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటైన ఏకామ్రేశ్వర స్వామి క్షేత్రం కాంచీపురం లోనే కలదు.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా | పురీద్వారావతీ చైవ సప్తైతే మోక్ష దాయికాః | |

భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి.  కంచి మోక్షవిద్యకు మూలపీఠం, అద్వైతవిద్యకు ఆధారస్థానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగరశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డాణము. అతి ప్రధానమైన శక్తిక్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు దేహవిముక్తి నందిన పుణ్యస్థలం.

ఇప్పుడు జరగబోయే అత్తి వరదర్ ఉత్సవాలు జరిగేవి మీకు బాగా గుర్తుండాలి అంటే కాంచీపురం లో అమ్మవారి క్షేత్రం తో పాటు అంతలా ప్రసిద్ధికెక్కింది బంగారు బల్లి.. ఈ బంగారు బల్లి ఉన్న ఆలయం లోనే అత్తి వరదర్ ఉత్సవాలు జరగబోతున్నాయి.  ఈ ఆలయం లో స్వామి వారు పేరు వరదరాజ పెరుమాళ్ .. విష్ణు మూర్తి ఆలయం ..  108 వైష్ణవ క్షేత్రాలలో ఈ ఆలయం మొకటి.

1053 సంవత్సరం లో  చోళులు ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది.  ట్రావెల్స్ వారు కాంచీపురం లో దర్శించే ఆలయాలలో విష్ణు కంచి , శివ కంచి అని రాస్తుంటారు మీరు గమనించే ఉంటారు కదా.. ఈ ఆలయం లో ఉన్న ప్లేస్ ని విష్ణుకంచి అని , అమ్మవారి ఆలయం ఏకామ్రేశ్వర స్వామి ఆలయం ఉన్న చోటును శివ కంచి గా పిలుస్తారు.    వరదరాజ పెరుమాళ్   దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది.

ఈ దేవాలయంలో వెయ్యి స్తంభాల మండపం ఉంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని కృత యుగములో బ్రహ్మ, త్రేతా యుగములో గజేంద్రుడు, ద్వాపరయుగములో బృహస్పతి, కలి యుగములో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఈ దేవాలయ మహాత్మ్యం హస్తిగిరి మహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడ మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవతా మూర్తి విగ్రహాలు ఉంటాయి.

కాంచీపురం చేరుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం .

కాంచీపురం తమిళనాడు లో చెన్నై కి 70 కిమీ దూరం లో ఉంది. తిరుమల , తిరుపతి , శ్రీ కాళహస్తి , అరుణాచలం , శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నుంచి డైరెక్ట్ బస్సు లు ఉన్నాయి. కాంచీపురం లో రైల్వే స్టేషన్ ఉంది కానీ ప్రధాన రైళ్లు వెళ్లవు. లోకల్ ట్రైన్స్ మాత్రమే వెళ్తాయి. చెంగల్ పట్టు వరకు వచ్చి అక్కడ నుంచి కాంచీపురం వెళ్ళాలి.

తిరుపతి నుంచి కాంచీపురం 108 కిమీ , అరుణాచలం నుంచి కాంచీపురం 118 కిమీ , గోల్డెన్ టెంపుల్ నుంచి కాంచీపురం 70 కిమీ దూరం ఉంది.  కాంచీపురం లో వెళ్లేసమయం లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ దేవాలయాలు ఉదయం 12 గంటల వరకే ఓపెన్ చేసి ఉంచుతారు . ఒక్కోసారి 12.30 వరకు ఉండవచ్చు . మరల సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

కాంచీపురం లో ఉండటానికి చాలానే హోటల్స్ ఉన్నాయి . ప్రస్తుతం 500 నుంచి 700 వరకు తీసుకుంటున్నారు . ఉత్సవ సమయం లో 1000 దాటి అవకాశం ఉంది.  మీకు కావాల్సిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి .

ఇవి కూడా చూడండి :

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

Key words : Kanchipuram Temples Hotels Kanchi Route Map Near by Temples Tour Packages Tamil Nadu Famous Temples

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *