Jyotirlingas Information | Kedarnath Swami Temple

Jyotirlingas Information | Kedarnath Swami Temple

History Timings Accommodation Phone Numbers

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్. పరమేశ్వరుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైనది కేదార్‌నాథ్‌ మహాక్షేత్రం. హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగయుగాలుగా వేలాదిమంది భక్తుల పూజలు అందుకుంటోంది. రుద్రహిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సి వుంటుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్‌ జిల్లాలోని పర్వతాల్లో పరమశివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తారు. శీతాకాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. వేసవికాలం ప్రారంభంలోనే ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది. మందాకిని నది జన్మస్థానం కూడా కేదార్‌నాథ్‌ సమీప పర్వతాల్లోనే వుంది.

స్వయంభువుగా శివుడు :

కేదార్‌నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్టితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్‌నాథ్గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాధ్ లను చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు. ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. ఆలయం ముందు నంది విగ్రహం వుంటుంది. ఆలయంలో పరమశివుడు సదాశివమూర్తిగా దర్శనమిస్తారు. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడు. ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు విజేతలుగా నిలుస్తారు. అయితే యుద్ధంలో తమ సొంత దాయాదులను చంపవలసివచ్చినందుకు ఎంతగానో వేదనకు గురవుతారు. తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసం హిమాలయాలకు చేరుకుంటారు. ఈశ్వరుడు వృషభరూపంలో కేదారం వద్ద వుండటాన్ని పాండవులు గమనిస్తారు. వారు వచ్చేలోగా శివుడు భూమిలోకి వెళ్లిపోతాడు. పాండవులకు మోపురం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ దర్శనంతో పాండవులకు పాప విముక్తి కలుగుతుంది. భూమిలోకి వెళ్లిన పరమేశ్వరుని ముఖ భాగం నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలో వున్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. మధ్యమహేశ్వర్‌, తుంగ్‌నాథ్‌, రుద్రనాథ్‌, కల్పేశ్వర్‌, కేదార్‌నాథ్‌… ఈ ఐదింటిని పంచ కేదార్‌నాథ్‌ క్షేత్రాలుగా పేర్కొంటారు.

ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత :

ఆదిశంకరాచార్యులు ప్రాచీన ఆలయానికి సమీపంలోనే ప్రస్తుతం మనం చూసే ఆలయాన్ని నిర్మించారు. ఎన్నో వందల సంవత్సరాలు మంచుతో కప్పబడిన మహాపుణ్యక్షేత్రం అనంతరం దర్శనమివ్వడం భగవద్‌ అనుగ్రహమే. ఆదిశంకరులు ఇక్కడి నుంచే కైలాసానికి చేరుకున్నట్టు ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. మంచు కొండల నడుమ పెద్ద పెద్ద రాళ్లతో ఆలయాన్ని నిర్మించడం దైవానుగ్రహమని పెద్దలు చెబుతారు.

సందర్శించడానికి ఉత్తమ సమయం :

చార్ ధామ్ యాత్ర వెళ్ళడానికి అనువైన సమయం మే నుండి అక్టోబరు వరకు, వర్షాకాలం తప్ప. ఇది దేని వలన అంటే నాలుగు పవిత్రమైన ప్రదేశాలు గర్వాల్ హిమాలయాల్లో భారీ హిమపాతం కలిగివుంటాయి. తత్ఫలితంగా, ఆలయాలకు దారితీసిన అన్ని బ్లాక్ చేయబడతాయి. అంతేకాక, వర్షాకాల సమయంలో, కొండచరియలు విరిగి పడడానికి అవకాశం ఉంది, ఇది మరింత ప్రయాణం జరగకుండా చేస్తుంది.

ఆలయంకి ఈ విధంగా చేరుకోవచ్చు :

మంచుకొండల్లోని కేదార్‌నాథ్‌ క్షేత్రానికి చేరుకోవడం అత్యంత శ్రమతో కూడుకున్న పని. కానీ శివానుగ్రహం భక్తుల్ని ఆ ఇబ్బందులనుంచి దూరంచేస్తుంది. ఉత్తరాఖండ్‌లోని పవిత్రపుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను దర్శించుకోవడాన్ని మినీ చార్‌ధామ్‌ యాత్రగా పేర్కొంటారు. రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది. కేదార్ నాథ్ కు రావాలంటే హరిద్వార్ నుంచే ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. గౌరీకుండ్‌ నుంచి గుర్రాలు, డోలీలు లేదా కాలినడక ద్వారా ప్రయాణించాల్సి వుంటుంది. హిమపాతంతో కూడిన ప్రతికూల వాతావరణంలో భక్తులు ప్రయాణించాలి. హెలికాప్టర్ల సర్వీసులను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ ప్రయాణానికి ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి.

కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు. ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోదం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక మే నుంచి అక్టోబరు మాసాల మధ్య కాలం కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు అనుకూలమైన సమయం. శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభం వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. మే చివర నుంచి జూన్‌ నెలాఖరు వరకు రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. మంచు కురిసే ప్రాంతంలో ప్రయాణం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

How to Reach :

రోడ్డు మార్గం :

రిషికేశ్‌, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, దిల్లీనుంచి రోడ్డు మార్గం వుంది. గౌరీకుండ్‌ నుంచి 14 కి.మీ. నడక ప్రయాణముంటుంది. 2013లో సంభవించిన వరదల అనంతరం ఈ మార్గం ధ్వంసమయింది. మార్గాన్ని పునర్‌నిర్మించారు.

రైలుమార్గం :

రిషికేశ్‌ రైల్వేస్టేషన్‌ 243 కి.మీ. దూరంలో వుంది. రిషికేశ్‌కు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైలు సౌకర్యముంది.

విమానయానం :

డెహ్రాడూన్‌లోని జాలిగ్రాంట్‌ విమానాశ్రయం. 260 కి.మీ.లో వుంది.

Sri Kedarnath Swami Temple Timings :

06:00am to 10:00pm(ఆలయం తెరిచి ఉన్నప్పుడూ మాత్రమే)

Sri Kedarnath Swami Temple Address :

Shri Badarinath – Shri Kedarnath Temples Committee,
Saket, Lane No-7, Canal Road, Dehradun,
Uttarakhand – 248001. INDIA.
Telefax: + 91 – (135) 2741600

e-mail: admin@badarikedar.org; chairman@badarikedar.org; pramod@badarikedar.org

Visit our Web Site: www.badarikedar.org

Temple Pooja and Sevas / Ticket Cost Information : Click Here

Accommodation in Sri Kedarnath Swami Temple : Click Here

Sri Kedarnath Swami Temple Google Map : Click Here

 

Keywords : Sri Kedarnath Swami temple, timings , history , accommodation , pooja timings , online ticket booking , Sri Kedarnath Swami devastanam, Sri Kedarnath Swami information, surrounding temples, tour packages , Hindu Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *