Jyotirlingas Information | Sri Bhimashankar Swami Temple

History Timings Accommodation Phone Numbers

జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారాష్ట్ర లో ఉన్న శ్రీ భీమశంకర్ ఆలయం ఒకటి. ఈ ఆలయం ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు చాల బాగా నచ్చుతుంది. భీముడు అనే రాక్షసుడుని శివుడు సంహరించేను, ఆ రాక్షసుని పేరుమీదనే స్వామి వారు భీమ శంకరులు అయ్యారు. త్రయంబకేశ్వరం నుంచి భీమశంకర్ ఆలయం 240 km దూరం.

ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత :

భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కి.మీ. ముంబాయికి 200 కి.మీ. దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది.

Sri Bhimashankar

ముంబై , పుణే ల నుంచి బస్సు సౌకర్యం ఉంది.. పూణే కు 124 కిలోమీటర్ల దూరం లో భీమ శంకర ఆలయం ఉంది. మీరు కజ్రాత్ వరకు ట్రైన్ లో వస్తే అక్కడ నుంచి 40 దూరం లోనే భీమ శంకర ఆలయం ఉంది .

భీమశంకర్ దేవాలయాన్ని 13 వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీష్వాల దీవాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రికా ఆధారాలనుసారం తెలుస్తోంది. ఆ గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆ ఆలయ శిఖరాన్ని చూడగానే ఎంతోభక్తి భావం కలగుతుంది. గుడి లోపల చిన్నగా వున్నా ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేసారు. దాని పైన ఒక కత్తి గాటు ఉంటుంది. క్రీ.శ.1437 లో చిమన్జీ అంతజీ నాయక్ అను నతను స్వామి ముందుర ఉన్నసభా మండపాన్ని నిర్మించాడు. రఘునాథ్ పీష్వా అనే అతను ఒక నూతిని తవ్వించాడు ఆ కోనేటి లోపల ఒక వినాయకుని విగ్రహం కుడా వుంది.ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమికంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాల పైన వుంటాయి. కాని లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమాశంకర్ ఒకటి అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమాశంకర్ గర్భ గుడి కూడా కిందికి ఉంటుంది. సులువైన మెట్ల మార్గం గుండా ఈ క్షేత్రానికి వెళ్లాలి. ఈ మార్గం గుండా కట్టెతో చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్థంబాలు పయిన కూడా ప్లాస్టిక్ రూఫ్ తో కూడిన మరి అత్యంత సుందరమైన స్వాగత ద్వారం ఎంతో రమణీయం.

Bhimshankar temple

పూర్తిగా అడవి, కొండలలోని ఈ ప్రాంతములోని ఆలయం ప్రకృతి సౌందర్యమునకు మారుపేరుగా ఉంటుంది. ఇప్పటికీ కనపడే కామరూప దేశపు రక్షణ గోడలు, అనేక రకములైన వృక్ష జాతులతో నయనాందకారకముగా ఉంటుంది. దగ్గర్లో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ నిలయంలో గల పెద్ద సైజు ఉడుతలు, గల అనేక అవకాశములతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.

Bhimashankar

ఐతే అనువైన కాలము ఆగస్టు, ఫిబ్రవరి నెలలు. వేసవిలో, వర్షాకాలములో అక్కడి వాతావరణము యాత్రలకు అనుకూలముగా ఉండదు.. ఖంఢాస్ నుండి రెండు నడక మార్గాలు కలవు. ఈ మార్గాల ద్వారా సుమారు ఆరు గంటలు సమయం పడుతుంది. శారీరకంగా దృఢంగా లేనివారికీ, వర్షాకాలం మరియు వేసవి కాలంలో నడక మార్గం అత్యంత క్లిష్టమైనది. ఖంఢాస్ నుండి రవాణా సదుపాయం ఉండదు. కనీసం 5-10 మంది ఉంటేనే నడక మార్గం వైపు వెళ్లాలి.

Sri Bhimashankar Pooja Temple Timings :

4.30 am Kagada Aarati
5.00 am Nijaroop Darshan
5.30 am Regular Pooja
12.00 pm Naivedya Pooja
12.00-03.00 pm Break.
03.00 pm Madya Aarathi ( No Darshan For 45 min )
04.pm to 9.30 pm Normal Darshan ( No Abhisekham Inside )
9.30 Mandir Closed.

Sri Bhimashankar Temple Pooja and Sevas / Ticket Cost Information : Click Here

Accommodation in Sri Bhimashankar Temple : Click Here

Sri Bhimashankar Temple Google Map : Click Here

How to Reach Bhimashankar Temple :

By Bus :

1) Pune – Rajguru Nagr – Manchar – Taleghar – Bhimashankar ; Distance 125 km.
2) Mumbai – Talegaon – Chakan – Manchar – Telaghar – Bhimashankar ; 240 km.
3) Mumbai – Talegaon – Chakan – Manchar – Telaghar – Bhimashankar; 215 km.

Sri Bhimashankar Temple Address :

Bhimashankar Temple Address :
Shivtirtha Bhimashankar,
Shri kshetra Bhimashankar,
via- Dimbhe Colony,
Taluka – Khed,
District – Pune,
State – Maharastra.

Key Words : Sri Bhimashankar Temple, timings , history , accommodation , pooja timings , Sri Bhimashankar Temple online ticket booking , Sri Bhimashankar Temple devastanam, Sri Bhimashankar Temple information, surrounding temples, tour packages, Hindu temples guide.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *