Jyotirlinga Information | Srisailam Mallikarjuna Swami Temple

Jyotrilinga Information |Srisailam-temple Hindu temples guide

History Timings Accommodation Phone Numbers

శ్రీశైలంకి సిరిగిరి అని మరియు శ్రీగిరి , శ్రీ పర్వతం , శ్రీశైలం అనే మొదలగు నామాలు కలవు. శ్రీ అనగా సంపద , శైలం అనగా పర్వతం. కనుక శ్రీశైలం సంపద్వంతమైన పర్వతం అని అర్ధం. దీనికి శ్రీకైలాసం అనే పేరు కూడా వ్యవహారం లో కూడా ఉన్నది. క్రీ.శ . 1313 లోని ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీకైలాసం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసం (శ్రీశైలం)పైన నివసించారు అని ఉన్నది.

శ్రీశైలక్షేత్రం ఆంద్రప్రదేశ్ కి చెందిన కర్నూలు జిల్లాకు 180 కి. మీ దూరంలో ఉంది. హైదరాబాద్ కు 220 కి. మీ దూరంలో కృష్ణా నదీ తీరంలో ఉంది. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానంగా పేరు పొందింది.శ్రీశైలం ఒక లోతైన అడవిలో నల్లమల కొండలలో ఉంది.

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర :

శివ మరియు పార్వతి తమ కుమారులకు తగిన వధువులను గుర్తించాలని నిర్ణయించినప్పుడు, శ్రీ గణేష మరియు కార్తికేయ మొదట పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వాదించారు. ప్రధాక్షం లో ప్రపంచాన్ని చుట్టుముట్టే వ్యక్తి మొదట పెళ్లి చేసుకుంటాడని శివ భగవానుడు చెప్పాడు. ఆ సమయంలో కార్తికేయ తన వాహానాపై ప్రపంచం చుట్టుముట్టేవాడు, గణేశ తన తల్లిదండ్రులను 7 సార్లు చుట్టుముట్టారు. (శస్త్రాలు ప్రకారం, ప్రదీక్షిని ర తల్లిదండ్రులలో ఒకప్పుడు ప్రపంచాన్ని (భూప్రధాక్షం) తిరగడానికి సమానంగా ఉంటుంది. శివ బుద్ధి (తెలివి), సిద్ధి (ఆధ్యాత్మిక శక్తి)  వినాయకుడిని వివాహం చేసుకున్నారు. తిరిగి వచ్చినప్పుడు కార్తీకేయ ఆగ్రహించి, కుమారబ్రహ్మచారి పేరుతో కొండ పై ఒంటరిగా ఉండడానికి వెళ్ళాడు. తన తండ్రిని అతనిని తృప్తి పరచడానికి తన తండ్రిని చూసినప్పుడు, అతను మరొక స్థలానికి వెళ్ళటానికి ప్రయత్నించాడు, కానీ దేవతల కోరికతో, దగ్గరగా ఉండేవాడు. శివ మరియు పార్వతి నివసించిన స్థలం శ్రీశైలం అని పిలువబడింది.  ఇక్కడ ప్రధాన దేవత మూర్తి మల్లికార్జున స్వామిగా ప్రాచుర్యం పొందిన దేవతకు దారితీసింది మల్లెలు (స్థానికంగా పిలువబడే మల్లికా) తో పూజింపబడింది. కావున ఈ స్వామి మల్లికార్జునా స్వామిగా పేరు వచ్చినది.

అమ్మవారి ఆలయ చరిత్ర :

ఇచ్చట అమ్మవారు శ్రీ బ్రమరాంబిక దేవిగా పూజలు అందుకుంటునారు. ఈ ప్రాంతంలో అమ్మవారు ఉండడానికి ఒక కధ ప్రాచుర్యం లో ఉన్నది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచనే పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రాహ్మ కోసం తప్పస్సు చేసి ద్విపదలచే మరియు చతుష్పాధలచే మరణం చేకుండా వరం పొందాడు. ఆ వర ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్దించారు. అమ్మవారు ప్రత్యక్షమాయి అరుణాసురుడు తన భక్తుడు కావున తను గాయత్రి మంత్ర జపం చేస్తూ ఉన్నంత కాలం అతనిని ఎవరు ఏమీ చేయలేరు అని చెపుతుంది

తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన  బృహస్పతి అరుణాసురుడి దగ్గరికి పంపిస్తారు.  అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వక్తం పరుచగా బృహస్పతి అందుకు సమధానం గా ఇద్దరం ఒకే అమ్మవారి భక్తులము గాయత్రి మంత్రం పూజా చేస్తున్నాము కాబట్టి ఈ రాక లో వింత ఏమీ లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజా చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజా చేయాలి అని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానివేస్తాడు. దానితో కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడు అతని సైన్యాని సంహరిస్తాయి.

శ్రీశైలంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు :

శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదువందల వరకు శివలింగాలు ఉంటాయి. శ్రీశైలం దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. మనోహరగుండం, నాగప్రతిమలు,పంచపాండవల దేవాలయాలు , అద్దాలమండపం,వృద్ద మల్లికార్జునలింగం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ గోపురం, శ్రీశైలప్రాజెక్ట్ ఇంకా గుళ్ళు,గోపురాలు , మఠాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన ఆలయాల సమాచారాన్ని క్రింద ఇవ్వడం జరిగినది.

1. పాతాళగంగా :

శ్రీశైలం పక్కనే కృష్ణా నది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం కొండపైన స్వామిఆలయం కలదు.నది మాత్రం క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుంచి చాలా మెట్లు దిగి కృష్ణా నదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణా నదినే ఇక్కడ “పాతాళగంగా” అనే సార్ధక నామంతో వ్యవహస్తారు.

ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణానదిలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగా అనునది ఎంత సార్ధక నామమో తెలుస్తుంది.  పాతాళ గంగా నీరు నీలం రంగు కాకుండ పచ్చగా ఉంటుంది. నీటి కింద బండ లపై నాచు నిలచి సూర్య కిరణాల వల్ల పచ్చగా కనిపిస్తుంది. ఇక్కడ కార్తీక మాసంలో ఎక్కువ సంఖ్యలో దీపాలు వదులుతారు.

2.  సాక్షి గణపతి :

ఈ ఆలయం శ్రీశైలనికి 2 kms దూరంలో కలదు. ఈ‌ స్వామి ని దర్శించుకోవడం వల్ల కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకత మనం శ్రీశైలం దర్శించుకునము అన్నీ ఈ సాక్షి గణపయ్య సాక్ష్యం చెపుతాడు. అందు వల్లనే ఈ స్వామికి సాక్షి గణపతి అనే పేరు వచ్చినది.

3. శ్రీశైల శిఖరం :

ShikaramNandi Hindu temples guide

శ్రీశైలం లో ఒక ప్రత్యేకత కలదు. ఈ శ్రీశైల శిఖరంనికి. శ్రీశైల దర్శనం చేసుకుంటే పునః జన్మ ఉండదు అని శాస్త్రాలు చెపుతునాయి. శిఖర  దర్శనం అనగా దూరంగా ఉన్న ఆలయాని చూడడం కాదు.

మనలో ఉన్న శివుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అనే భావనా తో పైకి తీయగలిగితే అలా చూడగలిగితే అపుడు పునః జన్మ నుంచి విముఖ్తీ పొందుతారు.

4. ఫాల ధార , పంచదార :

శివుడి నుదురు మరియు జ్ఞానాగ్ని నేత్రాని తగిలి ప్రవహిచినది కావున ఫాలధార అని అంటారు. పంచదార అనగా ఐదు ధారాలుగా ఉరికి వచ్చే జలాలు.  ఏ కాలం లోనైనా ఎక్కడి నీరు ఒకే విధంగా ప్రవహిస్తూ ఉంటుంది.  ఒకొక్క ధార ఒక్కొక రుచితో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఐదు ధారాలని ఐదు పేర్లతో పిలుస్తారు. 1. బ్రహ్మ ధార , 2. విష్ణు ధార, 3. రుధ్ర ధార , 4. చంద్ర ధార , 5. దేవ ధార.

5. జగ్గత్ గురువు శ్రీ ఆది శంకరా చార్య స్వామి ఆలయం :

శంకరులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండే వారు. అద్వైత మత వ్యాప్తి నచ్చని కొందరు వ్యక్తులు ఆయనని అంతం చేయాలి అని ఒక దొంగల ముఠా నాయకుడుకి రెచ్చగొట్టి కొంత సొమ్ము ఇచ్చి పంపిస్తారు. గురువు గారికి ఏదో అపాయాము సంభవించినది అని తెలిసుకున్న పద్మపాదాచార్యుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్దించగా ఎక్కడి నుంచో ఒక సింహం వచ్చి ఆ దొంగల ముఠా నాయకుడిని చంపివేసి ఆది శంకరా చార్య స్వామి రక్షిస్తుంది.

అంతవరకు శంకరా స్వామి ద్యానంలో ఉంటారు. ఈ విషయం ద్యానం నుంచి బయటికి వచ్చిన తరువాత తెలుసుకుంటారు. ఈ ప్రాంతం లోనే శ్రీ శంకరాచార్య స్వామి శివానంద లహరి , సౌందర్య లహరి రచనలు చేశారు. ఈ ప్రాంతం లోనే స్వామి పాదముద్రలు ఉంటాయి. కంచి పీఠదీపతులు అయిన 68వ పీఠదీపతి నడిచే దేవుడు గా పేరు గాంచిన ” శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామి ” ఈ ప్రాంతం లోనే ఉండిపోతాను అనీ అన్నారు అంతటి పరమ పవిత్రమైన ప్రాంతం ఈ ఆలయం.

7. హటకేశ్వరం :

శ్రీశైల ప్రధాన ఆలయం నుంచి ఈ ఆలయం కి 3 kms దూరంలో కలదు. మరియు పాలధార, పంచాధర ఎదురుగా ఉన్నది ఈ ఆలయం. పరమ శివుడు అట్టిక (ఉట్టి ,కుండ పెంకు) లో వెలియడంతో ఈ ఆలయానికి అట్టికేశ్వరుడు అనే పేరు వచ్చినది. మారుతున్న కాలం తో పాటు ఈ ఆలయం పేరు కూడా హట్టకేశ్వరం స్వామిగా మారిపోయింది.

ఈ ఆలయం పక్కనే శ్రీ లలిత దేవి ఆలయన్ని కూడా చూడవచ్చు. శ్రీశైల ప్రధాన ఆలయం నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాహనాలు కూడా ఈ ఆలయాలకి వెలుతాయి. మరికొన్ని ఆలయాలు కదళివనం , భీముని కొలను , శ్రీ అక్కమహాదేవి గుహలు , చెంచు లక్ష్మీ మ్యూజియం , శ్రీ ఇష్టకామేశ్వరి , మల్లెల తీర్ధం , ఉమా మహేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి.

ఆలయానికి చేరుకునే మార్గం :

బస్ రూట్ :

దేశంలో అన్నీ ప్రాంతాల నుంచి మొదట హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ చేరుకోవాలి. ఇక్కడ నుంచి నేరుగా ఈ ఆలయానికి బస్ లు కలవు.

ట్రైన్ రూట్ :

దేశం లోని అన్నీ ప్రాంతాల నుంచి మొదట సికింద్రాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకొని , అక్కడి నుంచి కర్నూల్ జిల్లా చేరుకొని తిరిగి బస్ లో చేరుకోవచ్చు.

Sri Mallikarjuna Swami Temple Timings:

Morning : 5 am to 12 pm
Evening :4 pm to 9 pm

Suprabhatha Seva Darshanam : 

Time : 4 am

Amount : 500/-

Entry : Single Person

Mongala harathi  :

Time : 5.00 am

Amount : 500/-

Entry : Single Person

Seegradarshanam:

Ticket Cost : 200/-

Entry : Single Person

Antaralaya Darshanam :

Ticket Cost : 500/-

(Abhishekaanantara Darshanam)

Entry : Single Person

Special Queue Darshan Line  :

Ticket Cost : 50/-

Timings : 6.30 am to 1pm & 6.30 pm to 9 pm

Quick Darshanam :

Ticket Cost : 100/-

Timings : 6.30 am to 1pm & 6.30 pm to 9 pm

Sri Mallikarjuna Swami  Temple Address:

Srisaila Devasthanam,
Srisailam – 518101,
Kurnool (Dt),
Andhra Pradesh (State).

For any information regarding Sevas, Accommodation, Annadanam donation, Srisaila Prabha, Go-Shaala, Devasthanam Hospital, Please call to any of the following Srisaila Devasthanam Call center numbers.

  • 8333901351
  • 8333901352
  • 8333901353
  • 8333901354
  • 8333901355
  • 8333901356

Srisaila Temple Pooja and Seevas / Ticket Cost Information : Click Here

Accommodation in Srisailam : Click Here

Sri Mallikarjuna Swami Temple Google Map: Click Here

 

Key Words : Srisailam temple, Srisaila Mallikarjuna Jyotirlinga History , Temple Timings , Accommodation , Pooja Timings , Online Ticket Booking , Srisaila Devastanam, Kurnool District information, Surrounding Temples, Tour Packages ,Hindu Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *