Jyotirlinga Information | Sri Somnath Swami Temple

History Timings Accommodation Phone Numbers

శ్రీ సోమనాథ ఆలయం :

త్రివేణి సంగం (కపిల, హీరాన్ మరియు సరస్వతి మూడు నదుల సంగమం) అనే పేరుతో పురాతన కాలం నుండి సోమనాథ్ ప్రదేశం ఒక యాత్రా స్థలం. సోమ,  అనగా చంద్రుడు అని అర్దం. ఇంకా ప్రత్యామ్నాయ పేర్లు సోమేశ్వర్ మరియు సోమనాథ్ (“ది లార్డ్ ఆఫ్ ది మూన్” లేదా “చంద్రుడు దేవుడు”) అనే పేర్లు కూడా ఉన్నాయి.

ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత :

శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్తారు. జ్యోతిర్లింగాల్లో మొదటి పుణ్యక్షేత్రం శ్రీ సోమనాథేశ్వర క్షేత్రం.సకల దేవతలకు ఆరాధ్యదైవంగా శ్రీ సోమనాథేశ్వరుడు పూజింపబడుతున్నాడు.   శ్రీ సోమనాథేశ్వరక్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర జిల్లాలో ఉంది. ప్రశాంత వాతావరణంలో సముద్రతీరంలో అత్యంత మనోహరంగా ఉంటుంది ఈ క్షేత్రం.

ఈ ఆలయాని అనేక సార్లు ముస్లింలు దాడి చేసరని చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తున్నది. క్రీ. శ .1783 లో  శివభక్తురాలు అయిన అహల్యభాయ్ హాల్ఖర్ ఈ ఆలయాన్ని పునర్మించినట్లు చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది.  శ్రీ సోమనాథేశ్వర క్షేత్రం శివతీర్థం,అగ్నితీర్థం,సూర్యతీర్థ ల సంగమ క్షేత్రం. మొట్టమొదట ఈ క్షేత్రాన్ని చంద్రుడు దర్శించాడట అనంతరం ఈ క్షేత్రం మీద ఉన్న మక్కువతో శంకరుని దివ్య జ్యోతిర్లింగాన్ని స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణ మందిరాన్ని నిర్మించాడని స్కంద పురాణం ద్వారా అవకతమవుతుంది. చంద్రునికి సోమేర్ అనే పేరు ఉంది . అందువల్ల ఇక్కడ శివుడు సోమేనాదేశ్వర్ గా ప్రసిద్ధి చెందాడు.  గర్భగుడిలో అరడుగల ఎత్తున పెద్ద శివలింగం ఉంటుంది.

ఈ క్షేత్రని దర్శించిన శ్రీ కృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వారిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీ సోమనాథేశ్వర స్వామి వారికి రోజూ ఉదయం పూట ఒకసారి మాత్రమే అభిషేకం చేస్తారు. ఇక్కడ ఉన్న చంద్రకుండలో స్నానం చేసి సోమనాథేశ్వర్ ని  దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని భక్తులు నమ్మకం.చంద్రుడే సోమనాథేశ్వరుని స్వయంగా ఇక్కడ ప్రతిష్టించినట్లు పురాణాల్లో చెబుతుంటారు.నిత్యం భక్తులతో రద్దిగా ఉంటుంది .శ్రీ సోమనాథేశ్వర్ ఆలయ ప్రాంగణంలోకుడివైపు వినాయకుడు,గర్భాలయంలో ఎడమ వైపు గణపతి ,కుడి వైపు హనుమంతుడు ఆలయం బయట మండపంలో భక్తులకు మహా మృత్యుంజయ  మండపం దర్శనం ఇస్తుంది.

గుడిలోనికి ప్రవేశించగానే ఎడమ ప్రక్కన సముద్రపు కెరటాలు ఉవెత్తున ఎగసి పడుతూ ఉంటు చుట్టూ ఖాళీస్థలం,చుట్టూ చిన్న చిన్న మండపాలు ఉంటాయి.సోమనాధ్ వెళ్ళడానికి అహ్మదాబాద్ నుంచి వీరవాల్ వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి 7 కి. మీ బస్ లేదా ఆటోలో ప్రయాణించి సోమనాథుని గుడికి చేరుకోవచ్చు. ఆహ్మాబాద్ నుంచి వీరవాల్ కు 400 కి. మీ.

ఈ గుడి చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రదేశాలు :

శ్రీ కృష్ణుడు నిర్మాణం చెందిన వృక్షం స్థలం, భేట్ద్వారకా , శ్రీ కృష్ణుడు గోపికలు చీరలు ఎత్తుకెళ్లిన గోపితలాబ్, ఇతర గుళ్ళు గోపురాలు ఉన్నాయి. భేటీద్వారక కి వెళ్ళడానికి కొద్దిసేపు సముద్ర ప్రయాణం చేయాలి.

Sri Somnatheswara  Swamy Temple Timings:

Morning : 5 am to 12 pm
Evening  : 4 pm to 9  pm

Sri Somnatheswara Swamy Temple Address:

Somnath Prabhas Patan,
Junagadh,
Gujarat 362268.

Somnath Temple Pooja and Seevas / Ticket Cost Information : Click Here

Accommodation in Somnath Temple : Click Here

Somnath Temple Google Map : Click Here

Keywords : Sri Somnath Swami Temple , Sri Somnath Swami timings , history , accommodation , pooja timings , Sri Somnath Swami Temple online ticket booking , Sri Somnath Swami Temple Devastanam,  information, surrounding temples, tour packages, Hindu temples guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *