Dharma Sandehalu | Why Should We Sit For A While At Temples After Darshan ?

Why Should We Sit For A While At Temples After Darshan ?,Temples,Hindu Temples

గుడిలో ఎందుకు దైవ దర్శనం అనంతరం కూర్చోవాలి?

దేవాలయం అనేది ఒక పవిత్రమైన ప్రదేశం.ఆలయంలో నిత్యం శ్లోకాలు, ఘంటానాదాలు, భక్తుల ప్రార్థనలు, పురోహితుల వేదమంత్రాలతో గుడిలో అనునిత్యం పూజలు చేస్తుంటారు. పరిసరప్రాంతాలు నిత్యం ఆధ్యాత్మికతో నిండి ఉంటుంది.
భగవంతుని దర్శనం కాగానే ఆలయ ప్రాంగణంలో కొంచం సేపు కూర్చోవడం మన సంప్రదాయం.

అక్కడ నిరంతరం శ్లోకాలు, పురోహితుల వేదమంత్రాలు వినవస్తుంటాయి. మనం అనేక సమస్యలతో సతమతమవుతుంటాం. అలాంటి పరిస్థితుల్లో గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుంది. దైవదర్శన అనంతరం, ఆలయ ప్రాంగణంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని భగవంతుని ఆరాధన గానీ, కాసేపు దేవుడి ధ్యానం గాని చేసి,

అప్పుడు ఆ సమయంలో మన మనస్సులో ఆ దివ్యమంగళ స్వరూపమే దర్శనమిస్తుంటుంది. మనసుకి ప్రశాంతతో పాటు స్వామివారిని చూసిన అలౌకిక ఆనందం మిగులుతుంది. ఇలా చేయడం ద్వారా మన మనసు ఇతర ప్రాపంచిక అంశాలపైకి వెళ్లకుండా దైవంపైనే కేంద్రీకరిస్తుంది. అక్కడ ప్రసాదం స్వీకరించాలి.అందుకే, గుడిలో దైవ దర్శనం అనంతరం అక్కడ కాసేపు కూర్చోవాలి.

Key Words:

Why Should We Sit For A While At Temples After Darshan ?,Temples,Hindu Temples,Dharma Sandehalu,God Images,Lord Shiva Temples,TTD,Tirumala Tirupati

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *