భజగోవింద స్తోత్రము | Bhajagovinda Stotram lyrics in Telugu

Bhajagovindam Telugu

జగద్గురువులు శ్రీ ఆదిశంకరుల విరజిత రచనలో భజగోవిందం ఒకటి. భజ గోవిందం భజగోవిందం అంటూ ఈ స్తోత్రం ప్రారంభం అవుతుంది. మానవ జీవితం ఒక్కో దశను దాటుకుంటు మరణం అనే చివరి ఘట్టానికి సమయం తెలియకుండానే సాగిపోతుందని. ప్రతి దశలో తెలియకో , తెలిసో , బాధ్యత , కోరికో , భద్రతో , సంసారం సాగరమో లో మునుగుతూ భగవంతుని స్మరణ లేకుండా సాగిపోతుంది. నీకు ఎప్పుడో సమయం దొరుకుతుంది అప్పుడు తీరిగ్గా భగవంతుని నామ స్మరణ చేద్దాం ధ్యానం చేసి మోక్షాన్ని పొందుదాం అనుకుంటున్నావేమో అంతసులభము కాదు ప్రతి దశలోనూ నీకు ఏదొక అవరోధము ఉంటూనే ఉంటుంది. ఇప్పుడే మొదలు పెట్టు ఇప్పుడే మొదలు పెట్టు అంటూ ఆది శంకరులు భజగోవిందం భజ గోవిందం అంటూ స్తోత్రాన్ని మనల్ని ఉద్దరించడానికి ఇచ్చి ఉన్నారు. భజగోవిందం రాయాలని రాసింది కాదు వృద్ధాప్యం లో ఉన్న వ్యాకరణం తెలిసిన పండితుడు డుక్రింకరణే డుక్రింకరణే అంటూ వ్యాకరణాన్ని పఠిస్తూ ఉండగా సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే అంటూ హెచ్చరిస్తారు.

భజగోవింద స్తోత్రం

భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుక్రింకరణే || 1 ||

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణామ్ |
యల్లభసే నిజ కర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 ||

నారీ స్తనభర నాభీదేశం
దృష్ట్వా మా గా మోహావేశమ్ |
ఏతన్మాంస వసాది వికారం
మనసి విచింతయా వారం వారమ్ || 3 ||

నళినీ దళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలమ్ |
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్ || 4 ||

యావద్-విత్తోపార్జన సక్తః
తావన్-నిజపరివారో రక్తః |
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కో‌உపి న పృచ్ఛతి గేహే || 5 ||

యావత్-పవనో నివసతి దేహే
తావత్-పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్ కాయే || 6 ||

బాల స్తావత్ క్రీడాసక్తః
తరుణ స్తావత్ తరుణీసక్తః |
వృద్ధ స్తావత్-చింతామగ్నః
పరమే బ్రహ్మణి కో‌உపి న లగ్నః || 7 ||

కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో‌உయమతీవ విచిత్రః |
కస్య త్వం వా కుత ఆయాతః
తత్వం చింతయ తదిహ భ్రాతః || 8 ||

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || 9 ||

వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
ఙ్ఞాతే తత్త్వే కః సంసారః || 10 ||

మా కురు ధనజన యౌవన గర్వం
హరతి నిమేషాత్-కాలః సర్వమ్ |
మాయామయమిదమ్-అఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా || 11 ||

దిన యామిన్యౌ సాయం ప్రాతః
శిశిర వసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః || 12 ||

ద్వాదశ మంజరికాభిర శేషః
కథితో వైయా కరణస్యైషః |
ఉపదేశో భూద్-విద్యా నిపుణైః
శ్రీమచ్ఛంకర భగవచ్ఛరణైః || 13 ||

కా తే కాంతా ధన గత చింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జన సంగతిరేకా
భవతి భవార్ణవ తరణే నౌకా || 14 ||

జటిలో ముండీ లుంజిత కేశః
కాషాయాన్బర బహుకృత వేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః
ఉదర నిమిత్తం బహుకృత వేషః || 15 ||

అంగం గలితం పలితం ముండం
దశన విహీనం జాతం తుండమ్ |
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశా పిండమ్ || 16 ||

అగ్రే వహ్నిః పృష్ఠే భానుః
రాత్రౌ చుబుక సమర్పిత జానుః |
కరతల భిక్షస్-తరుతల వాసః
తదపి న ముంచత్యాశా పాశః || 17 ||

కురుతే గంగా సాగర గమనం
వ్రత పరిపాలనమ్-అథవా దానమ్ |
ఙ్ఞాన విహీనః సర్వమతేన
భజతి న ముక్తిం జన్మ శతేన || 18 ||

సురమందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమ్-అజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగత్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః || 19 ||

యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ || 20 ||

భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికా పీతా |
సకృదపి యేన మురారీ సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా || 21 ||

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనమ్ |
ఇహ సంసారే బహు దుస్తారే
కృపయా‌உపారే పాహి మురారే || 22 ||

రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగీ యోగ నియోజిత చిత్తః
రమతే బాలోన్మత్తవదేవ || 23 ||

కస్త్వం కోஉహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః |
ఇతి పరిభావయ నిజ సంసారం
సర్వం త్యక్త్వా స్వప్న విచారమ్ || 24 ||

త్వయి మయి సర్వత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాఞ్ఛస్యచిరాద్-యది విష్ణుత్వమ్ || 25 ||

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహ సంధౌ
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్-సృజ భేదాఙ్ఞానమ్ || 26 ||

కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాஉ‌உత్మానం పశ్యతి సోஉహమ్ |
ఆత్మఙ్ఞ్నాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరక నిగూఢాః || 27 ||

గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమ్-అజస్రమ్ |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్ || 28 ||

సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణమ్ || 29 ||

అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తి తతః సుఖ లేశః సత్యమ్ |
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః || 30 ||

ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారమ్ |
జాప్యసమేత సమాధి విధానం
కుర్వ వధానం మహద్-అవధానమ్ || 31 ||

గురు చరణాంభుజ నిర్భరభక్తః
సంసారాద్-అచిరాద్-భవ ముక్తః |
సేందియ మానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ || 32 ||

మూఢః కశ్చిన వైయాకరణో
డుకృణ్కరణాధ్యయన ధురీణః |
శ్రీమచ్ఛంకర భగవచ్చిష్యైః
బోధిత ఆసీచ్ఛోదిత కరణైః || 33 ||

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *