వాల్మీకి రామాయణ విశేషాలు రామాయణ శ్లోకం

ramayanam

రామాయణం

రామాయణం ఆది కావ్యము , వాల్మీకి మహర్షి సంస్కృతం లో రచించారు. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము. రామాయణం లో 24,000 శ్లోకాలు కలవు. రామాయణం లో భాగాలను కాండలు అని పిలుస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు “సర్గ”లని పిలుస్తారు.

రామాయణం లో 7 కాండలు కలవు అవి.

బాల కాండము (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము

అయోధ్యా కాండము (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము

అరణ్య కాండము (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము

కిష్కింధ కాండము (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము

సుందర కాండము (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట

యుధ్ధ కాండము (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము

ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి – (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)

రామాయణం ఒక్క శ్లోకంలో!
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణమ్ ||

ఇవి కూడా చదవండి :

సనాతన ధర్మ మూలాలు    భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు     ఆధ్యాత్మిక పుస్తక నిధి     రామాయణం పుస్తకాలూ     1956-2020 వరకు గల పంచాంగాలు 

Keywords : Ramayanam , Basic information of Ramayanam, Ramayanam Story , Ramayanam information in telugu,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *