అరుణాచలం మొదటి సారి వెళ్లేవారికోసం | Arunachalam Temple History Accommodation Route

Arunachalam Temple

Arunachalam Temple History Giripradakshina Accommodation Details :

అరుణాచలాన్ని అక్కడివారు తిరువణ్ణామలై అని పిలుస్తారు. అరుణాచలం లో స్వామి వారు పేరు అరుణాచలేశ్వరుడు, అరుణాచలం ఆలయం చాల విశాలమైనది పైగా ఎత్తైన గోపురాలతో చూడగానే తన్మయం తో చూస్తుండిపోయే నిర్మాణాలు కలిగిఉంటుంది. తమిళనాడు లో చాల ఆలయాలు ఎత్తైన గోపురాలను కలిగి ఉంటాయి.అరుణాచలం లో గిరిప్రదక్షిణ, అరుణాచలేశ్వరుని దర్శనం , ఆది అన్నామలై దర్శనం , రమణాశ్రమం దర్శనం ప్రధానంగా చేయాల్సినవి. అంతకంటే ముందు మీరు వినకపోతే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అరుణాచల మహత్యం విని వెళ్ళండి.

అరుణాచలం స్థలపురాణం :

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.

ప్రధానదేవాలయాం :

arunachalam info

తిరువణ్ణామలై లో రైల్వే స్టేషన్ నుంచి సుమారు 2 కిమీ దూరం లో అరుణాచలేశ్వరుని ఆలయం కలదు. నాలుగు వైపులా ఎత్తైన గోపురాలను కలిగియుంది. ఈ ఆలయం చాల సువిశాలంగా ఉంది. ఆలయం లోపుల ప్రతి నిర్మాణం వెనుక స్థలపురాణం కలదు. ఈ లోపుల ప్రధానం గా శ్రీ రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళలింగ దర్శనం చేసుకుంటారు భక్తులు. తూర్పు రాజగోపురాన్ని శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించారు. ఎత్తైన 10 గోపురాలలో ఈ ఆలయ గోపురమొకటి. ఆలయం లోపల కోనేరు కలదు భక్తులకు స్నానం చేయడానికి వీలులేదు. ఎత్తైన నంది కలదు.

శ్రీ రమణాశ్రమం :

అరుణాచలం లో రమణాశ్రమం ప్రధాన ఆలయానికి 2 కిమీ దూరం లో కలదు, రమణాశ్రమం శేషాద్రి స్వామి ఆశ్రమం రెండు పక్కప్రక్కనే ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆశ్రమం లోకి ప్రవేశం కలదు. రమణాశ్రమం లో ఎంతో మంది విదేశీయులు ధ్యానం చేయడం మనం చూడవచ్చు. రమణాశ్రమం ప్రవేశమే ఒక ఆధ్యాత్మిక అనుభూనిస్తుంది. రమణాశ్రమం లో స్వేచ్ఛగా ఎగిరే నెమళ్ళు , అల్లరిచేసి కోతులను చూడవచ్చు. రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే stay@gururamana.org కి మెయిల్ చేయాలి. వారి వీలునుబట్టి రూమ్స్ ఇస్తారు కనీసం నెల రోజులు ముందుగా మెయిల్ చేయాలి.

గిరిప్రదక్షిణ :

Giripradakshina

అరుణాచలం లో గిరిప్రదక్షిణ చాల చాల విశేషమైనది. ప్రతి పౌర్ణమికి వేలల్లో భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు . చైత్ర పౌర్ణమి నాడు లక్షల్లో చేస్తారు. గిరిప్రదక్షిణ 14 కిమీ దూరం ఉంటుంది. గిరిప్రదక్షిణ ప్రతిరోజూ చేస్తారు , గిరిప్రదక్షిణ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

1) గిరిప్రదక్షిణ పర్వదినాలలో అందరితో కలిసి చేయడం గొప్ప అనుభునిస్తుంది
2) గిరిప్రదక్షిణ లో అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన శివ లింగాల దర్శనం చేస్కోవచ్చు
3) రాత్రి వేళలో కూడా ఆలయాలు దర్శనానికి వీలుగా తెరిచేవుంటాయి
4) అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ప్రదక్షిణ చేయాలి

సూచనలు :

1) గిరిప్రదక్షిణ 14 కిమీ తారు రోడ్డు పై నడవాల్సి యుంటుంది
2) ఉదయం వెళ్ళేవాళ్ళు 9 లేదా 10 గంటలకు గిరిప్రదక్షిణ ముగిసేలా ప్లాన్ చేసుకోవాలి
3) రోడ్ పైన నడవడం కనుక ఎండ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయండి
4) మీతో పాటు మంచినీళ్లు తీస్కుని వెళ్ళండి, తినే పదార్ధాలు కూడా తీసుకునివెళ్ళండి
5) చిల్లర కూడా తీస్కుని వెళ్ళండి చాలామంది సన్యాసులు మనకి కనిపిస్తారు
6) 14 కిమీ నడవాలి కనుక కనీసం 15 రోజులు ముందుగా మీరు ఇంటి దగ్గర నడక అలవాటు చేస్కోండి
7) నెమ్మదిగా నడిస్తే 4 గంటలు పడుతుంది
8) గిరిప్రదక్షిణ ఉపవాసాలతో చేయకండి

రూమ్స్ :

అరుణాచలం లో దేవాలయం దగ్గర్లో మరియు రమణాశ్రమం దగ్గర రూమ్స్ ఉన్నాయి. పౌర్ణమి రోజుల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి. మామోలు రోజుల్లో 500/- వసూలు చేస్తారు.  రమణాశ్రమం , శేషాద్రి స్వామి ఆశ్రమాలలో కనీసం 15 రోజులు ముందుగా రూమ్ బుక్ చేసుకోవాలి. తెలుగు వారి శివసన్నది గురించి చాల పిర్యాదులు అందుతున్నాయి . డొనేషన్ బట్టే రూమ్స్ ఇస్తారని చాల ఎక్కువ డిమాండ్ చేస్తారని ..

Arunachalam Accommodation Rooms Phone Numbers :

seshadri ashramam : 91417523699
siva sanndihi : 914175235089
andhra ashramam : 914175236174

అరుణాచలం ఎలా వెళ్ళాలి :

Arunachalam Siva Namalu

అరుణాచలం తమిళనాడు లో ఉంది. చెన్నై నుంచి 194 కిమీ దూరం. అరుణాచలం లో రైల్వే స్టెయిన్ ఉంది. మీరు తిరువణ్ణామలై అని సెర్చ్ చేయాలి. తిరుపతి బెంగళూరు నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు. దగ్గర్లో గల రైల్వే స్టేషన్ కాట్పాడి . కాట్పాడినుంచి తిరువణ్ణామలై 90 కిమీ. మీరు విజయవాడ మరియు హైద్రాబాద్ నుంచి వచ్చేలా ఉంటె మీరు కాట్పాడి లో దిగి అక్కడ నుంచి బస్సు లో రావాలి. 2 గంటల సమయం పడుతుంది. బెంగళూరు వెళ్లే శేషాద్రి ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. కాట్పాడి జంక్షన్ కనుక చాల ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి. కాట్పాడి అంటే ఎక్కడో అనుకుంటారు . శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కి 15 కిమీ దూరం లో ఉంది. మీరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేస్కుని అరుణాచలం వెళ్ళవచ్చు. అరుణాచలం నుంచి చిదంబరం , కాంచీపురం , వెల్లూర్ , తిరుమల కు డైరెక్ట్ బస్సు లు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి :

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *