అన్నవరం చుట్టూ ప్రక్కల చూడవలసిన దేవాలయాలు 

అన్నవరం

అన్నవరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన శంఖవరం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది .

తలుపులమ్మలోవ

తలుపులమ్మ లోవ తూర్పు గోదావరి జిల్లా, తుని మండలానికి చెందిన గ్రామము. తునికి సమీపంలో ఉన్న లోవకొత్తూరు దగ్గర ఉంది. లోవ కొత్తూరు సమీప గ్రామం అక్కడి వరకూ బస్సుసౌకర్యం ఉంది. అక్కడి నుండిలో దేవాలయం వరకూ ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు.

కుమారభీమారామము

పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది.

పురుహూతికా ఆలయం

పురూహుతికా క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలవబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం.

ర్యాలీ

ర్యాలి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

దత్త ముక్తి క్షేత్రం

శ్రీ దత్త ముక్త్రి క్షేత్రం, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ చెందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ లో ఉంది.

అంతర్వేది

అంతర్వేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన సఖినేటిపల్లి నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసాపురం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.

వాడపల్లి

వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలంలో గోదావరి వడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామము. మరియు ప్రఖ్యాత పుణ్యక్షేత్రము. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *