About Us

raja chandra at google office

ఎలా మొదలైంది

నమస్కారం నా పేరు రాజాచంద్ర , తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాసిని. చెన్నై లో జాబ్ చేస్తూ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు విని రామేశ్వరం , అరుణాచలం , కాంచీపురం మొదలైన పుణ్య క్షేత్రాలను దర్శించి నా అనుభవాలను కొత్తవారికి తెలిసేలా మొదట బ్లాగ్ లో రాయడం మొదలు పెట్టాను. 

Hindu Temples Guide

.చాలామంది భక్తులకు ఉపయోగపడుటచేత దేవాలయాల సమాచారం తో పాటు సనాతన ధర్మం యొక్క మూలాలైన వేదాలు , పురాణాలూ , ఇతిహాసాలు, గ్రహాలు , నక్షత్రాలు , తెలుగు సంవత్సరాలు , తిథులు , యుగాలు , దశావతారాల పై కనీస అవగాహనా కలిగేలా సమాచారం తో పాటు  నీతి పద్యాలు , స్తోత్రాలు , ఆధ్యాత్మిక పుస్తకాలూ , భాగవత పద్యాలు , ధర్మ సందేహాలు , దేవాలయాల ఫోన్ నెంబర్ లు ట్రావెల్స్ సమాచారం తో పాటు ఆధ్యాత్మిక- దేవాలయాల పై క్విజ్ లు, ప్రవచనలు చెప్పే వారి యొక్క వివరాలు. గోశాలలు , వేద పాఠశాలలు , శిధిలావస్థలో ఉన్న దేవాలయాలు, హిందూ ధర్మాన్ని పరిరక్షించే సంస్థల వివరములు, సామజిక సేవ చేసే వారి యొక్క వివరములు ఉద్యోగ సమాచారం కూడా  హిందూ టెంపుల్స్ గైడ్ వెబ్సైటు లో పొందుపరుస్తున్నాను. భక్తులకు సమాజానికి ఉపయోగపడే  విధంగా ఎప్పటికప్పుడు తగిన మార్పులు చేస్కుంటూ హిందూ టెంపుల్స్ గైడ్ సన్మార్గం లో ముందుకు నడుస్తుంది.