ఘంటసాల గానం చేసిన భగవద్గీత శ్లోకాలు | Ghantasala Bhagavadgeeta Slokas

bhagavadgeeta slokas

భగవద్గీత లో మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు కలవు. ఘంటసాల గారు భగవద్గీత  గానం తో పామరులకు సైతం భగవద్గీతను అర్ధమయ్యేలా చెప్పారు అనడం లో అతిశయోక్తి లేదు. తెలుగు పద్యాలలో శతక పద్యాలూ మనకు తెలుసు కదా శతకం అంటే 100 , శతక పద్యం అంటే 100 పద్యాలూ అయినటప్పటికీ 108 పద్యాలూ రాయడం ఆనవాయితీగా వస్తుంది. బహుశా శతక పద్యాలనూ దృష్టిలో పెట్టుకుని కాబోలు భగవద్గీతలో కూడా 107 శ్లోకాలు పూర్తీ చేసారు. ప్రారంభం ముగింపు తో కలుపుకుంటే 108 దాటినట్టే. ఘంటసాల గారు గానం చేసిన శ్లోకాలు వాటి భావాలూ ఏ అధ్యాయం లో ఏ శ్లోకం పాడారో క్రింద వివరంగా ఇవ్వడం జరిగింది. వీటిని తెలుగు వికీపీడియా నుంచి శ్లోకాలు తీసుకోవడం జరిగింది. మీకు పాడుకోవడానికి వీలుగా ఆడియో కూడా ఇస్తున్నాము.

Ghantasala Bhagavadgeeta Slokas

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ||1-32||

స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః|| 2-11 ||

దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు

దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి|| 2-13 |

జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యెట్లో మరొక దేహమును పొందుటకు కూడ అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా-
న్యన్యాని సంయాతి నవాని దేహీ|| 2-22 ||

మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ(జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.

నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః|| 2-23 |

ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది.

జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి|| 2-27 ||

పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః|| 2-37 |

యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 2-47 ||

కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 |

దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును

ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 |

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 |

విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 2-72 ||

ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.

లోకేऽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం కర్మయోగేన యోగినామ్|| 3-3 ||

అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః|
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః|| 3-14 |

అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును.

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి|| 3-16 ||

పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను.

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| 3-21 ||

ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.

మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః|| 3-30 ||

అర్జునా! నీ వొనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః|| 3-35 |

చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్|| 3-38 ||

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్|| 4-7 |

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే|| 4-8 ||

ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః|
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః|| 4-10 |

అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.

యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః|| 4-11 |

ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు.

యస్య సర్వే సమారమ్భాః కామసఙ్కల్పవర్జితాః|
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పణ్డితం బుధాః|| 4-19 ||

ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్|
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా|| 4-24 |

. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును

శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||

. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును

సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ|
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే|| 5-2 |

కర్మ, సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః|
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా|| 5-10 |

ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః|
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్|| 5-16 |

. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును

విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని|
శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః|| 5-18 |

.విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్|
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః|| 5-23 ||

.దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును.

యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః|
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః|| 5-28 |

.ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును.|

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్|
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి|| 5-29 |

సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.

యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ|
న హ్యసంన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన|| 6-2 ||

అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు|
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా|| 6-17 |

. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము

యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా|
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః|| 6-19 ||

గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని|
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః|| 6-29 |

సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, తనను అన్ని భూతములయందును చూచుచుండును

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్|
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే|| 6-35 ||

అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును

యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా|
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః|| 6-47 |

అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః|| 7-3 ||

. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమె నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు

భూమిరాపోऽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా|| 7-4 |

. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.

మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ|
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ|| 7-7 ||

అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది

పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ|
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు|| 7-9 |

భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే|| 7-14 ||

. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము

చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోऽర్జున|
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ|| 7-16 ||

. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు

బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే|
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః|| 7-19 ||

జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు.

అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః|| 8-5 ||

ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా|
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్|| 8-8 ||

కవిం పురాణమనుశాసితార-
మణోరణీయంసమనుస్మరేద్యః|
సర్వస్య ధాతారమచిన్త్యరూప-
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్|| 8-9 ||

. అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు

అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్|
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ|| 8-21 ||

. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.

శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే|
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః|| 8-26 |

. జగత్తునందు శుక్ల,కృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి

వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్|| 8-28 |

. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు.

సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్|
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్|| 9-7 |

పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను

అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్|| 9-22 |

ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను.

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః|| 9-26 |

ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః|| 9-34 ||

పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు

మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా|
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః|| 10-6 ||

కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ|| 10-9 ||

పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు.

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ|| 10-20 ||

సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను

వేదానాం సామవేదోऽస్మి దేవానామస్మి వాసవః|
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా|| 10-22 ||

వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే.

ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోऽహం వైనతేయశ్చ పక్షిణామ్|| 10-30 |

రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా|
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంऽశసమ్భవమ్|| 10-41 ||

లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు

పశ్య మే పార్థ రూపాణి శతశోऽథ సహస్రశః|
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ|| 11-5 ||

. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|
బ్రహ్మాణమీశం కమలాసనస్థ-
మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్|| 11-15

అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప|| 11-16 |

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని|
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస|| 11-25 ||

. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము.

కాలోऽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|
ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే
యేऽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః|| 11-32 ||

అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్|
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్|| 11-34 ||

ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము

కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే|| 11-46 ||

అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా..

సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ|
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాఙ్క్షిణః|| 11-52 ||

. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.

మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః|| 12-2 ||

ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు

శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే|
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్|| 12-12

అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది

అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః|| 12-16 |

ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.

సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః|
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః|| 12-18 ||

తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః|| 12-19 ||

శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు

ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే|
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః|| 13-2 ||

అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు.

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోऽన్యథా|| 13-12 ||

ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును

కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే|| 13-21 ||

. ప్రకృతిని ‘మాయ’ యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించుచుండెను.

సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి|| 13-28 ||

శరీరము నశించినను, తాను నశింపక, ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో, వాడే యెరిగినవాడు.

అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోऽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే|| 13-32 ||

అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యెను. కర్మలనాచారించువాడు కాడు.

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత|| 13-34 ||

పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు యెళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః|| 14-1 |

జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను

సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః|
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా|| 14-4 ||

. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను(పరమాత్మ) తండ్రి వంటివాడను.

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్|
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ|| 14-6 ||

అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది.

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్|
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్|| 14-7 ||

ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది.

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్|
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత|| 14-8 ||

అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును

మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే|| 14-25 ||

మానావమనములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.

ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్|| 15-1 ||

బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.

న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః|
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ|| 15-6 ||

పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాదుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 15-14

దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.

తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత|| 16-3 ||

దమ్భో దర్పోऽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్|| 16-4 |

పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్|| 16-21 ||

. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.

యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః|
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్|| 16-23 ||

శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు.

త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు|| 17-2 ||

జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి.

యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః|
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః|| 17-4 ||

. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు.

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే|| 17-15 ||

ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును.

కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః|
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః|| 18-2 ||

జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.

అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్|
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్|| 18-12 ||

కర్మములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు.

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే|
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ|| 18-30 ||

అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము.

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్ఠతి|
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా|| 18-61 ||

ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.

సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః|| 18-66 ||

సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.

య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి|
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః|| 18-68 ||

ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా|
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనఞ్జయ|| 18-72 ||

ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత|
స్థితోऽస్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ|| 18-73 ||

కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ|| 18-78 ||

యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును.

keywords : bhagavadgeeta, bhagavadgeeta slokas, telugu devotional,

You may also like...

1 Response

  1. Srinivas says:

    Namaskaram Andi Gantasala garu alpimchina Bhagavath Gita PDF telugu lo pampa galara, paina kanabarichina vidamga danyavadalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *