Famous Temples in India | Chardham Yatra Tirumala Rameswaram Amarnath

famous temples in india

భారదేశం లో లెక్కపెట్టలేనన్ని క్షేత్రాలు కలవు. రామాయణం , మహాభారత ఇతిహాసాలకు సంబందించిన క్షేత్రాలు దేశమంతటా కలవు. రామాయణం లో రాముడి జననం తరువాత సీతమ్మవారితో కలిసి తండ్రిమాటకై అడవులకు వెళ్లడం, రావణ సంహారం తో తిరిగి వచ్చి పట్టాభిషేకం, లవకుశువుల జనం ఈ రామాయణ కథకు ఆధారమైన ప్రదేశాలు అయోధ్యతో ప్రారంభమై మహారాష్ట్ర , తమిళనాడు ,శ్రీలంక వరకు ఎన్నో క్షేత్రాలు కలవు. అదే విధంగా మహాభారతం లో పాండవులు కూడా అరణ్యవాసం అజ్ఞాత వాసం చేయడం , కురుక్షేత్ర యుద్ధం. ఆ తరువాత పాండవులు స్వర్గారోహణ వరకు , శ్రీ కృష్ణ పరమాత్ముడు కు సంబంధించి ద్వారకా , మథుర క్షేత్రాలు ఇలా మహాభారత కథను ఆధారంగా ఎన్నో క్షేత్రాలు కలవు. వీటిని కాల విభజన చేయడం కష్టమైనప్పటికీ దేవాలయాల నిర్మాణం ఆధారంగా కాలవిభజన చేసారు.

రామాయణ , మహాభారతాలే కాకుండా శివపురాణం, విష్ణుపురాణం , భాగవతం లో చెప్పబడిన కథలకు ఆధారమైన క్షేత్రాలు కలవు. ఇవే కాకుండా భక్తుల యొక్క కోరికను ఆధారంగా భగవతంతుడు స్వయంభు గా వెలసిన క్షేత్రాలు ఎన్నో కలవు. వ్యాసమర్షి , శ్రీ ఆదిశంకర చార్యులు ప్రతిష్ట చేసిన క్షేత్రాలు , వారు నడియాడిన ప్రదేశాలు కలవు.

హిందూ దేవాలయాలు భారతదేశానికి పరిమితం అనుకుంటే పొరపాటే ఈ రోజుకి విదేశాలలో ఎన్నో పురాతనమైన క్షేత్రాలు కలవు. అతి పెద్ద హిందూ ఆలయం భారతదేశం లో లేదు అంటే అర్ధం చేస్కోవచ్చు.శక్తి పీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు , 108 దివ్య తిరుపతులు , చార్ ధామ్ , నవ నరసింహ క్షేత్రాలు , సుబ్రహ్మణ్యుడి ఆరుపడైవీడు క్షేత్రాలు, అష్టవినాయక క్షేత్రాలు . త్రిలింగ క్షేత్రాలు , నవగ్రహ ఆలయాలు , పంచారామ క్షేత్రాలు , పంచభూత క్షేత్రాలు, పంచ కన్నన్ క్షేత్రాలు , నవ తిరుపతులు , త్రిగయా క్షేత్రాలు, అష్టమూర్తి లింగేశ్వర క్షేత్రాలు వీటిలో శక్తిపీఠాలు భారతదేశం వెలుపలకుడా కలవు.

Jyothirlinga Kshetras
astadasa shakti peethas
Sri Anantapadmanabha Swami Ashtotara shatanamavalli | Telugu Stotras
kanipakam vinayaka swamy devasthanam
17 special Lord Shiva Temples in India
Sathyanarayana Swamy Vari Devasthanam,Annavaram

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *